శ్రీనివాసన్ గురు సమర్పణ లో యస్ యస్ బి ఫిల్మ్స్ పతాకంపై సాత్విక్ వర్మ, జాక్ రాభిన్ సన్,,మంజీరా రెడ్డి, అమీర్తా హాల్దర్ నటీ నటులుగా. ముత్తు.యం దర్శకత్వంలో శ్రీనివాసన్ గురు తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మించిన చిత్రం “చిక్లెట్స్”.ఈ చిత్రం నుండి విడుదలైన ఒక పాటకు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా ఈ చిత్రంలోని రెండవ పాటైన నా ఆశే.. వేవే..లు. అనే సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ సినిమాకు బాలమురళి బాలు చక్కని సంగీతం అందించాడు. అందరికి అర్ధమయ్యే పదాలతో వనమాలి రాసిన లిరిక్స్ కు సింగర్ సౌమ్య మాదవవన్ చాలా
చక్కగా ఆలపించారు.
నా ఆశే.. వేవే..లు..
వినవా యే..’మిటో..
నే.. వెతికా..ఇన్నాళ్లు
ఎదలో.. ప్రే..మతో
ఊ..రుకోదు ప్ర్రా..యం
అది కో..రుతోంది సా..యం
రా.. రా… అమలిన అసురా…
లాంటి లిరిక్స్ ఖచ్చితంగా యూత్ ను ఆకట్టుకుంటాయి.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాత శ్రీనివాసన్ గురు మాట్లాడుతూ..నా ఆశే.. వేవే..లు..పాట వింటుంటే చాలా క్లాసీ గా ఇంట్రెస్ట్ గా చాలా కొత్తగా అనిపిస్తుంది.ఈ పాటకు దస్తా అందించిన కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. డి ఓ పి కోలాంచి కుమార్ ఈ సినిమాకు చక్కటి విజువల్స్ ఇచ్చాడు. ఈ సాంగ్ విడుదలైన అతి తక్కువ సమయం లోనే ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇప్పుడున్న జనరేషన్ అందరూ వారికీ ఏది కావాలి, ఏది వద్దు అనే వాటిపై పూర్ మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు.
అందుకే 90 జనరేషన్ పిల్లలకు , 2కె జనరేషన్ పిల్లలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి.. అలాగే పిల్లలకు పేరెంట్స్ కు మధ్య జరుగుతున్నటు వంటి సంఘర్షణ ఏంటి అనేది మా చిక్లెట్స్ సినిమాలో చెప్పడం జరిగింది.. పిల్లలపై తల్లి తండ్రులకు ఎలాంటి ప్రేమ ఉంటుందో, అలాగే పిల్లలకు కూడా తల్లీ తండ్రులపై అదే విధమైన ప్రేమ ఉందా లేదా..అనే విషయాన్ని ఈ సినిమాలో చూయించడం జరిగింది.. ఇందులో లవ్, ఎంటర్టైన్మెంట్ , పేరెంట్స్ ఎమోషన్ ఇలా అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా మంచి మెసేజ్ ఉండేలా తెరకెక్కిన “చిక్లెట్స్” చిత్రం చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
నటీ నటులు : సాత్విక్ వర్మ, జాక్ రాభిన్ సన్,రిజిమా, మంజీరా రెడ్డి, నాయన్ కరిజ్మా, అమీర్తా హాల్దర్ తదితరులు
సాంకేతిక నిపుణులు
సమర్పణ : శ్రీనివాసన్ గురు
బ్యానర్ ::యస్ యస్ బి ఫిల్మ్స్
నిర్మాత : శ్రీనివాసన్ గురు
రచన, దర్శకత్వం : ముత్తు.యం
కెమెరా : కొల్లంజి కుమార్
మ్యూజిక్ : బాల మురళి బాలు
ఎడిటర్ : విజయ్ వేలు కుట్టి
కో డైరెక్టర్ : యస్. యస్. కృష్ణ
లైన్ ప్రొడ్యూసర్ : డానియల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సుబ్రమణ్యం
పి. ఆర్. ఓ : ఏలూరు శ్రీను, ధీరజ్, ప్రసాద్