నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ సినీ నటుడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారుడైన హరికృష్ణ గారి కుమారుడు. ఈయన 1978 జులై ఐదున హరికృష్ణ, లక్ష్మీ దంపతులకు జన్మించారు. హరికృష్ణకు తన పిల్లలలో ఒకరినైనా డాక్టర్ చదివించాలని కోరిక ఉండేది. విద్యాభ్యాసం విజయవాడలోని కేసీపీ సిద్ధార్థ స్కూల్లో జరిగింది. తరువాత కోయంబత్తూర్ లో బీటెక్ పూర్తి చేశారు. తన తండ్రి కోరిక మేరకు చికాగోలో ఎమ్మెస్ చేసి ఉద్యోగం చేసేవారు. కొన్ని రోజులు గడిచాక సినిమాలలో నటిస్తానని చెప్పి ఉద్యోగం వదిలేశారు.
2003లో తొలిచూపులోనే అనే సినిమాలో నటించారు. ఇక ఈయన నటించిన రెండో చిత్రం అభిమన్యు. రెండు సినిమాలు ప్లాప్ అవడంతో కుటుంబ సభ్యులు సన్నిహితులు సినిమాలలో రాణించడం కష్టం ఉద్యోగం చేసుకుంటే బెటర్ అని సలహా ఇస్తే తనపై ఉన్న నమ్మకంతో సినిమాలలోనే కొనసాగాలని అనుకున్నాడు. ఒక వివాహ వేడుకలో స్వాతిని చూసిన లక్ష్మి వెళ్లి భర్తతో స్వాతి గురించి చెప్పి మన అబ్బాయి కైతే మంచి ఇల్లు జోడు నాకైతే నచ్చింది అంటుంది. ఒకరంటే ఒకరికి నచ్చడం.
తరువాత కళ్యాణ్ రామ్ నువ్వు ఇంకా కావాలంటే పై చదువులు చదవచ్చు అంటాడు, కానీ స్వాతి నాకు ఫ్యాషన్ డిజైర్ కావాలని ఉందని చెప్పడంతో కళ్యాణ్ రామ్ అంగీకరించాడు. అలా 2006లో ఇరు కుటుంబాల మధ్య ఘనంగా స్వాతిని వివాహం చేసుకున్నాడు కళ్యాణ్ రామ్. తండ్రి హరికృష్ణ మాత్రం కొడుకు వద్దంటే కూడా సినిమాల్లోకి వచ్చాడు ఇప్పుడు కోడలు కూడా వైద్యవృత్తిని వదిలి సినిమా పైపే వెళ్లడం హరికృష్ణ గారికి నచ్చలేదు. ఈ విషయంపై కాస్త కోపంగా ఉండేవారు.
తరువాత 2014లో అన్న జానకిరామ్ యాక్సిడెంట్ లో చనిపోవడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. తోడికోడలుకు, అత్తమామలకు ధైర్యం చెప్పి అండగా నిలిచింది స్వాతి. తర్వాత 2018లో హైదరాబాద్ నుంచి కావలి వెళ్తున్న హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇది ఆ కుటుంబంలో ఒక విషాదఛాయగా నిలిచిపోయింది. కుటుంబ బాధ్యతను అంతా స్వాతి చూసుకుంటూ అందరికీ అండగా ఉంది. ఇక కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా మంచి విజయం సొంతం చేసుకుంది.