TSR Movie Makers: షూటింగ్ పూర్తి చేసుకున్న TSR మూవీ మేకర్స్ ‘ప్రొడక్షన్ నెంబర్ 3’!

TSR మూవీ మేకర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందిన కొత్త చిత్రం షూటింగ్ విజయవంతంగా ముగిసింది. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణ సారథ్యంలో, ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకోనుంది. నటుడు హరికృష్ణ హీరోగా, భవ్యశ్రీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేమ, త్యాగం, కుటుంబ విలువలను ఆవిష్కరిస్తూ భావోద్వేగాలతో నిండిన కథాంశంతో రూపొందింది.

సినిమాటోగ్రఫీ బాధ్యతలను ప్రభాకర్ రెడ్డి నిర్వహించగా, గౌతమ్ రవిరామ్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. విజయ్ కందుకూరి రచించిన సంభాషణలు కథను మరింత బలపరిచాయి. ప్రేమ, త్యాగం, కుటుంబ బంధాలను ఆలంబనగా చేసుకున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక భావోద్వేగ అనుభవాన్ని అందించనుంది.

షూటింగ్ పూర్తయిన సందర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “మా బృందం అంకితభావంతో పనిచేసింది. ఈ సినిమా అందరి హృదయాలను తాకుతుందని ఆశిస్తున్నాం” అన్నారు.

దర్శకుడు ఆదినారాయణ మాట్లాడుతూ, “ప్రేక్షకులకు ఒక అర్థవంతమైన కథను అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు. త్వరలో విడుదల తేదీని, ఆసక్తికరమైన టైటిల్ తో ప్రకటించనున్న చిత్ర బృందం, ప్రేక్షకుల నుంచి గొప్ప ఆదరణ ఆశిస్తోంది.

బ్యానర్ : టిఎస్ఆర్ మూవీ మేకర్స్
ప్రొడ్యూసర్ : తిరుపతి. శ్రీనివాసరావు
డైరెక్టర్ : ఆదినారాయణ. పినిశెట్టి
హీరో : హరికృష్ణ
హీరోయిన్ : భవ్య శ్రీ
డి. ఒ. పి (DOP) : ప్రభాకర్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : గౌతమ్ రవిరామ్
డైలాగ్స్ : విజయ్ కందుకూరి
పి ఆర్ ఓ: మధు వి ఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

జగన్ ఉగ్రరూపం || Ys Jagan Fires On Chandrababu Over Tenali Incident || YCP Vs TDP || Telugu Rajyam