NTR ,Ram Charan : మెగా ఫ్యాన్స్ కన్నా ఆ విషయంలో ముందున్న నందమూరి ఫ్యాన్స్..

NTR, RamCharan: టాలీవుడ్ లో పెద్ద హీరోలుగా ఉన్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరిని ఒకే స్క్రీన్ పైకి తెచ్చాడు రాజమౌళి. నందమూరి, మెగా అభిమానులు మాత్రమే కాకుండా ఇండియా లెవెల్ లో సినిమా ప్రేక్షకులు అందరు ఆర్ ఆర్ ఆర్ ఫిల్మ్ కోసం ఎదురుచూస్తున్నారు. జనవరి లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా ఎక్కువ వ్యాపించడంతో వాయిదా పడింది.
సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అటు తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొని చిత్ర బృందం అలరించింది. ఇక సినిమా కొత్త విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. మార్చి లో సినిమా విడుదలకు సిద్ధమైంది.

వరల్డ్ వైడ్ విడుదలకు సిద్ధమైన RRR మూవీ వరల్డ్ వైడ్ థియేటర్స్ లో విడుదలవుతోంది. ఇక మెగా అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు సంబరాలకు సిద్ధమయ్యారు. అయితే మెగా అభిమానులకంటే నందమూరి అభిమానులు ఒక అడుగు ముందు ఉన్నారనే చెప్పాలి.

ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనక్కరలేదు. ఆంధ్రవాలా సినిమా ఆడియో విడుదల సమయంలో గవర్నమెంట్ ప్రత్యేక రైలు సదుపాయాలను నందమూరి అభిమానుల కోసం కల్పించింది. దాదాపు 5లక్షల మంది అభిమానులు ఆ ఈవెంట్ కు హాజరయ్యారని అంచనా. ఇది ఇప్పటికి ఒక రికార్డ్. అందుకే ఎన్టీఆర్ ను మాన్ అఫ్ మాసెస్ అంటారు.
ఇక రాజమౌళి తో ఎన్టీఆర్ సినిమా అనగానే నందమూరి అభిమానులకు పండగే. ఇక ఇపుడు ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల కు అన్ని సిద్ధం చేస్తున్నారు. మెగా అభిమానులకన్నా ముందే నందమూరి అభిమానులు ఎక్కువగా షోస్ వేయడానికి సిద్ధం చేస్తున్నారు.

ఇక ఫారిన్ లో ఏకంగా ఎన్టీఆర్ అభిమానులు ఒక సినిమా థియేటర్స్ ను మొదటి రోజుకు మొత్తం టిక్కెట్లు బుక్ చేసి ఆశ్చర్య పరిచారు. ఇలా నందమూరి అభిమానులు మెగా అభిమానులు కన్నా ఒక అడుగు ముందున్నారు సంబరాల్లో. ఇక సినిమా విడుదల అయ్యాక రచ్చ ఎంత చేస్తారో చూడాలి మరి