సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్ నామినేషన్స్ జాబితా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్లోని నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయింది. వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్‌లిస్ట్ కాగా, అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాకు ఎంపిక చేశారు. లగాన్ తర్వాత మరో ఇండియన్ మూవీ ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం ఇదే. అయితే 22 ఏళ్ల కిందట లగాన్ ఆస్కార్ తుది జాబితాలో నిలిచినా, అవార్డు దక్కలేదు. కానీ స్లమ్‌డాగ్ మిలియనీర్‌కు పనిచేసిన ఏ.ఆర్.రెహమాన్, రసూల్ పూకుట్టిలను ఆస్కార్ అవార్డులు వరించాయి. ఇక విషయానికొస్తే తాజాగా ఆస్కార్ మేకర్స్ ఓ ట్వీట్ చేశారు. నాటు నాటుతో పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన సాంగ్స్ వివరాలను తెలిపారు. సరదాగా వినండి అంటూ ట్వీట్ చేశారు.
నాటు నాటు (ఆర్ఆర్ఆర్)
నాటు నాటు సాంగ్కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్లోని పాట ఇది. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన ఈ పాట ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ పాటకు ఆస్కార్ రావాలి భారత దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు.
అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్)
2018 నుంచి డేన్ వారెన్స్ రూపొందించిన పాటలు వరుసగా నామినేషన్స్‌కు ఎంపిక అవుతోంది. ఆమె కెరీర్లో 14సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఇప్పుడు అప్లాజ్ పాటకు ఎంపికైంది. దీనిని సోఫియా కార్సన్ ఆలపించారు.
హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్)
1986లో వచ్చిన టాప్ గన్ చిత్రానికి సుమారు 36 ఏళ్ల తర్వాత సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ ‘టాప్ గన్: మార్వెరిక్’. అప్పట్లో ఒరిజినల్‌లోనూ టేక్ మై బ్రీత్ ఎవే కూడా అస్కార్కు నామినేట్ అయింది. ఇప్పుడు సీక్వెల్‌లోని హోల్డ్ మై హ్యాండ్ పాట ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం విశేషం. ఈ పాటకు లేడీ గాగా, బ్లడ్ పాప్ లిరిక్స్ అందించి ఆలపించారు. లేడిగాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో మూడు సార్లు నామినేట్ అయింది. ఇక 2018లో ఏ స్టార్ ఈజ్ బార్న్‌కు బెస్ట్ యాక్టర్స్‌కు నామినేట్ అయింది.
లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్)
ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డుల్ని షేక్ చేసిన సినిమా బ్లాక్ పాంథర్. ఈ చిత్రంలోనిలిఫ్ట్ మీ అప్ ఈ సాంగ్‌ను రిహన్నా ఆలపించింది. ఇది ఆమెకు రెండో ఆల్బమ్. తొలి సారి ఆమె ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ పాట కోసం నైజీరియన్ మ్యుజిషియన్స్ కూడా పనిచేశారు. టెమ్స్, కూగ్లర్ లిరిక్స్ అందించారు. ఈ పాట సంగీత ప్రియుల్ని బాగా ఉర్రూతలూగించింది.
ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలోని ఈ ది ఈజ్ ఏ లైఫ్ పాటను జపనీస్ మూలాలు ఉన్న ఇండీ పాప్ స్టార్ మిట్స్కీ, డేవిడ్ బైర్న్ ఆలపించారు. తొలిసారి వీరు ఆస్కార్‌కు నామినేఠ్ అయ్యారు. ఈ సాంగ్ కూడా ఆడియెన్స్‌ను ఓ ఊపు ఊపేసింది.