బడ్జెట్ కష్టాలు.! ఓ పెద్ద ప్రాజెక్టులో ‘కోత’.!

పెద్ద ప్రాజెక్ట్.. చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్ అది.! ప్రస్తుతానికి సెట్స్ మీదనే వున్న సినిమా.! ఓ ప్రముఖ హీరో నటిస్తున్న సినిమా. ఆషామాషీ వ్యవహారం కూడా పెద్ద బడ్జెట్‌తో ప్లాన్ చేసిన సినిమా. నిజానికి, మార్కెట్ లెక్కలకు మించి ఆ ప్రాజెక్టుని డిజైన్ చేసినప్పుడే, చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయట.

ఇప్పుడేమో ఓటీటీ మార్కెట్ డల్ అయిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థలు లైట్ తీసుకుంటున్నాయ్. దాంతో, కొన్ని ప్రాజెక్టులు అర్థాంతరంగా ఆగిపోతుంటే, కొన్ని ప్రాజెక్టులేమో బడ్జెట్టులో కోతలు విధించుకోక తప్పడంలేదు.

పైన చెప్పుకున్న సినిమాది వింత పరిస్థితి. ప్రారంభమైంది.. సగం పూర్తయ్యింది.. షూటింగ్ కొనసాగుతోంది. ఇంతలోనే, ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి చేదు కబురు. బడ్జెట్ తగ్గించుకోవాలని.. ముందు చేసుకున్న ఒప్పందాల్లో సవరణలు తప్పవని.. ఆ కబురు తాలూకు సారాంశమట.

దాంతో, చర్చలు షురూ అయ్యాయి. మధ్యేమార్గంగా ఓ ఫిగర్ సెట్ అయ్యిందట. కానీ, సవాలక్ష కండిషన్స్ అటువైపు నుంచి.. అంటే, ఓటీటీ సంస్థ నుంచి వచ్చాయనీ, అన్నిటికీ మేకర్స్ తల ఊపారనీ అంటున్నారు.

ఆ ప్రాజెక్ట్ ఏంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఒకటి కాదు, రెండు మూడు పెద్ద సినిమాల పరిస్థితీ దాదాపు ఇదే. ఎందుకిలా.? అంటే, ఓటీటీలోనూ సినిమాలు చూడ్డానికి జనాలు పెద్దగా ఇష్టపడటంలేదట. తలా తోకా లేని కంటెంట్ అయితే, ఓటీటీని సైతం జనం లెక్క చేసే పరిస్థితులు వుండవ్ మరి.