పవన్ “వీరమల్లు” లో అందుకోసమే ఎక్కువ ఖర్చు.!

harihara veeramallu

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాని దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన సినిమా కాగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో రికార్డు బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమా లో పవన్  వారియర్ రోల్ చేస్తుండగా ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నారు. అయితే పీరియాడిక్ సినిమా అంటే మళ్ళీ పాత రోజులు చూపించాల్సిందే. ఖర్చు తప్పదు. ముఖ్యంగా ఈ అంశాల్లో సెట్టింగ్స్ కన్నా ఎక్కువ పాత్ర పోషించేవి సినిమా గ్రాఫిక్స్ అని చెప్పాలి.

మరి ఈ సినిమాలో ఈ ఎఫెక్ట్స్ కూడా గట్టిగానే ఉండేలా ఉంటాయని గ్లింప్స్ చూస్తే అర్ధం అయ్యింది. కానీ అవి అంత ఎఫెక్టీవ్ గా లేవు. దీనితో ఈ సినిమాలో ఈ గ్రాఫిక్స్ పరంగా చాలా కేర్ తీసుకుంటున్నారట. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ముంబై లోనే వర్క్ చేయిస్తున్నారట.

అంతే కాకుండా టీజర్ కి కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే ముందు కన్నా సినిమా గ్రాఫిక్స్ కోసం మరింత బడ్జెట్ ని పెడుతున్నారని సినిమా విషయంలో నిర్మాత ఏ ఎం రత్నం కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యినట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ సమాచారం. మరి క్రిష్ అయితే ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. తనకి ఆల్రెడీ ఈ తరహా సినిమాలు చేసిన అనుభవం ఉంది కాబట్టి పర్వాలేదని చెప్పొచ్చు.