మంచు ‘భక్త కన్నప్ప’లో మోహన్‌ లాల్‌!

రోజు రోజుకు మంచు విష్ణు ‘భక్త కన్నప్ప’ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతూ ఉన్నాయి. అసలు మార్కెట్‌ లేని విష్ణు.. ఏకంగా వంద కోట్లతో సినిమా చేస్తున్నాడని ఓ వైపు.. మరో వైపు ప్రభాస్‌ సాక్షాత్తు శివుడిగా కనిపించబోతున్నట్లు మంచు విష్ణునే కన్ఫర్మ్‌ చేయడంతో ఒక్కసారిగా సినిమాపై సినీ లవర్స్‌లో అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగాయి.

ఇక ఇటీవలే ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా పార్వతీ దేవిగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కనిపించబోతున్నట్లు వచ్చిన వార్తలు కూడా నెట్టింట హల్‌ చేశాయి. కాగా తాజాగా ఈ సినిమా కాస్ట్‌లో మరో స్టార్‌ హీరో తోడయ్యాడు. మలయాళ మెగాస్టార్‌ మోహన్‌లాల్‌ ‘భక్త కన్నప్ప’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.

లేటెస్ట్‌గా మంచు విష్ణు, మోహన్‌లాల్‌ను కలిసాడని.. ఈ మేరకు వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఇక ఈ ప్రాజెక్ట్‌లోకి మోహన్‌లాల్‌ కూడా యాడ్‌ కావడంతో ఇండస్టీల్రో హాట్‌ టాపిక్‌గా చర్చలు నడుస్తున్నాయి. మహాభారతం టెలివిజన్‌ షోకు దర్శకత్వం వహించిన ముకేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. పాన్‌ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమా గ్రాండియర్‌ స్కేల్‌లో దాదాపు వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సమాచారం. మైథలాజికల్‌ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాను మోహన్‌బాబు నిర్మిస్తున్నాడు. పరచూరి గోపాలకృష్ణ, సాయిమాధవ్‌ బుర్ర, తోట ప్రసాద్‌ వంటి మేటి రచయితలు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. విజువల్స్‌ పరంగానూ, టెక్నికల్‌ పరంగానూ ఈ సినిమాను హై స్టాండర్డ్స్‌లో రూపొందిస్తున్నారట.

ఈ సినిమాలో భక్త కన్నప్ప గొప్పతాన్ని ఈ తరానికి చూపించబోతున్నారట. శ్రీవిష్ణుకు జోడీగా టైగర్‌ నాగేశ్వరరావు బ్యూటీ నుపూర్‌ సనన్‌ నటిస్తున్నట్లు ప్రకటించినా.. ఇటీవలే ఈ బ్యూటీ డేట్‌ ఇష్యూల వల్ల తప్పుకున్నట్లు శ్రీ విష్ణు కన్ఫర్మ్‌ చేశాడు. ప్రస్తుతం మేకర్స్‌ మరో కొత్త హీరోయిన్‌ కోసం గాలిస్తున్నారు.