సెల్బియన్‌ రొమాన్స్ గురించి మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన ఎంతోమంది వారసుల్ని కూడా హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో పరిచయం చేశారు. ఇలా సార్ హీరోగా గుర్తింపు పొందిన మోహన్ బాబు ఇద్దరి కుమారులతో పాటు కూతురు మంచు లక్ష్మి ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న లక్ష్మి టీవీ షో లను నిర్మించి వాటికి నిర్మాతగా కూడా వ్యవహరించింది.

ఇంకా ప్రస్తుతం సినిమాలకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉండగా చాలాకాలంగా వెండితెరకు దూరమైన మంచు లక్ష్మి ప్రస్తుతం “లేచింది మహిళా లోకం” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ క్రమంలో యాంకర్ ఆర్జే కాజల్ అడిగిన ప్రశ్నలకు మంచు లక్ష్మి ఓపెన్‌ కామెంట్స్‌ చేసింది. లేచింది మహిళా లోకం అనే సినిమాలో సెల్బియన్‌ రొమాన్స్ గురించి..అలాగే ఈ సినిమాలో ఆడవాళ్లకు సంబంధించిన మెసేజ్‌ గురించి ఆర్జే కాజల్ ప్రశ్నించింది.

ఈ ప్రశ్నకు మంచు లక్ష్మి స్పందిస్తూ… “లెస్బియన్‌ ప్రేమలో పడితే తప్పేముంది?అంటూ తిరిగి కాజల్ ని ప్రశ్నించి… నాకు గే పీపుల్, లెస్బియన్‌ విషయాల్లో ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. నా మనసులో వారి గురించి ఎటువంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. ఒక మహిళ లేదా పురుషుడు ఒక మహిళతో పురుషుడితో ఉండాలని నిర్ణయించటానికి మనం ఎవరు?.. సమాజంలో ఉన్న దాన్నే నేను సినిమాలో చూపించా. వాళ్ళు అలా రొమాన్స్ చేసుకోవటంలో తప్పేముంది. మన పురాణాల్లో ఉన్న శిఖండి ఎవరు? బృహన్నల ఎవరు? అంటూ చేసిన ఓపెన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.