Daksha Teaser: వినాయక చవితి శుభాకాంక్షలతో మంచు లక్ష్మి ‘దక్ష’ టీజర్ విడుదల.. సెప్టెంబర్ 19న సినిమా విడుదల

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy). ఇందులో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఇందులో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది. అంతేకాదు, మంచి మెసేజ్‌తో వస్తున్న ఇలాంటి సినిమాలు ఇప్పుడవసరం అంటూ సెన్సార్ సభ్యులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా మంచు లక్ష్మీ ప్రసన్న చేసిన టైటిల్ పాత్రను సెన్సార్ బోర్డు సభ్యులు కొనియాడారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ చిత్ర టీజర్‌ను వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం విడుదల చేసింది చిత్రబృందం.

ఈ టీజర్‌లో ఇప్పటి వరకు మంచు లక్ష్మి కనిపించని వీరోచిత రోల్‌లో, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. వింత ఆకారంలో ఎలియన్ వంటి ఓ జీవి మనుషుల్ని దారుణంగా చంపే సన్నివేశంతో టీజర్ మొదలైంది. అలాగే ఓ వింత వ్యాధి నేపథ్యం, దాని వెనుక కారణం ఏంటనే ఇంట్రస్ట్‌ని ఈ టీజర్ కలగజేస్తుంది. సముద్ర ఖని, విశ్వంత్, సిద్ధిక్, జెమినీ సురేష్ వంటి వారందరూ ఇందులో కీలక పాత్రలు పోషించినట్లుగా టీజర్ తెలియజేస్తుంది. ఇక చివరిలో డాక్టర్ మోహన్ బాబు కనిపించిన ఒకే ఒక్క షాట్.. టీజర్‌ స్థాయిని పెంచేసింది. ఆయన పాత్ర ఈ సినిమాకు ప్రాణం అనే హింట్ ఇచ్చేసింది. ఓవరాల్‌గా టీజర్‌తో సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడేలా చేశారు మేకర్స్.

Cast: మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి, సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, విశ్వంత్, చిత్రా శుక్లా, రంగస్థలం మహేష్, జెమినీ సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

సంగీతం: అచు రాజమణి
ఛాయాగ్రహణం: గోకుల్ భారతి
నృత్య దర్శకురాలు: బృంద
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ కృష్ణ మల్లా

ఉపరాష్ట్రపతి గెలుపు | Advocate Bala About YS Jagan Shocking Decision On Vice President Election |TR