మరో కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన మహేష్… భార్య పేరు మీదగా ప్రారంభం…?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో నటించిన మహేష్ బాబు ఆ తర్వాత హీరోగా మరి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నాడు. ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు.

ఇలా మహేష్ బాబు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేస్తున్నాడు. ఏషియన్ సంస్థతో కలిసి AMB సినిమాస్ నెలకొల్పి థియేటర్ బిజినెస్ లోకి అడుగు పెట్టాడు . ఆ తర్వాత ఓన్ గా క్లాతింగ్ బ్రాండ్ కూడా ప్రారంభించాడు. అంతే కాకుండా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించి నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టాడు. ఇక ఇప్పుడు మరొక కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. ఏషియన్ సంస్థతో కలిసి తన భార్య నమ్రత పేరు మీద హోటల్ బిజినెస్ ప్రారంభించనున్నాడని సమాచారం. ఈ క్రమంలో హైదరాబాదులో రెండు స్టార్ హోటల్స్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రెండు స్టార్ హోటల్స్ కు పేరు కూడా ఖరారు చేసినట్లు సమాచారం.

మహేష్ బాబు ప్రారంభించనున్న ఈ స్టార్ హోటల్స్ లో ఒక దానికి ‘మినర్వా ఎఎన్’ (ఏషియన్ నమ్రత) అని పేరు పెట్టారు. బంజారాహిల్స్ లోని టిఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న ఈ హోటల్ ని నవంబర్ లో ప్రారంభించనున్నట్లు తెలుస్తొంది. ఇక మరొక హోటల్ కి “పాలస్ హైట్స్” అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఈ హోటల్ ని డిసెంబర్ నెలలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆధ్యాత్మిక హక్కులతో నిర్మిస్తున్న ఈ స్టార్ హోటల్స్ లో ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ హోటల్ వ్యవహారాలకు సంబంధించిన అన్ని విషయాలు నమ్రత దగ్గరుండి చూసుకోబోతోందని సమాచారం.