మహేష్ బాబు ఆ సినిమాలో నటించాలని ఉంది.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వెర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు పొందిన సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఘట్టమనేని కృష్ణ మేనల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సుధీర్ బాబు ఏ మాయ చేసావే సినిమాలో సమంతకు అన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాత ఎస్ఎంఎస్ అని సినిమా ద్వారా హీరోగా మారాడు. ఆ సినిమా వల్ల సుధీర్ బాబుకి చెప్పుకోదగ్గ గుర్తింపు లభించలేదు. అయితే మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథా చిత్రం సినిమా ద్వారా సుదీర్ బాబు హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా విలన్ గా నటించి మెప్పించాడు.

ఇక ప్రస్తుతం సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్ పనులను ప్రారంభించింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. కాకుండా మహేష్ బాబు నటించిన “1 నేనొక్కడినే” సినిమా గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “1 నేనొక్కడినే” సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

అయితే మహేష్ బాబు నటించిన సినిమాలలో సుధీర్ బాబుకి ఈ సినిమా అంటే చాలా ఇష్టమట. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు నటించిన సినిమాలలో ఏ సినిమాలో మీరు మళ్లీ నటిస్తారు? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సుధీర్ బాబు సమాధానం చెబుతూ.. మహేష్ బాబు నటించిన “1 నేనొక్కడినే” సినిమాలో నటించాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఇంటెలిజెంట్ స్ర్కీన్‌ప్లేతో సాగిన ఈ సినిమా ప్లాప్ అవటం చాలా బాధాకరం. మహేష్ నటించిన సినిమాలలో ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. మహేష్ నటించిన సినిమాలలో మళ్లీ నేను నటించే అవకాశం వస్తే ఈ సినిమాలో నటించాలని అనుకుంటున్నాను అంటూ సుధీర్ బాబు సమాధానం చెప్పాడు.