SSMB 29: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి రెండు షెడ్యూల్స్ పూర్తి అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడవ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీపై భారీగా అంచనాలు నెల కొన్నాయి.
ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుత్తగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్బంగా ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. నేను ఇండియాను, హిందీ సినిమాలను మిస్ అవుతున్నాను. ఈ సంవత్సరం ఒక భారతీయ సినిమాలో నటిస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇండియన్ ఆడియన్స్ నాపై చూపే ప్రేమ ఎంతో విలువైనది.
అది ఎల్లప్పుడూ ఇలానే కొనసాగుతుందని ఆశిస్తున్నాను అని తెలిపారు. దీంతో ప్రియాంక ఎస్‌ఎస్‌ఎంబీ29 గురించి మాట్లాడిందంటూ అభిమానులు ఆనందిస్తున్నారు. SSMB29 విషయానికొస్తే.. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. అటవీ నేపథ్యంలో సాగే కథతో ప్రపంచాన్ని చుట్టేసే సాహస ప్రయాణంగా ఈ సినిమాని సిద్ధం చేస్తున్నారు రాజమౌళి. ఇందులో మహేశ్ మునుపెన్నడూ చేయని ఒక విభిన్నమైన పాత్రలో సరికొత్త లుక్‌తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో తెలిపారు.