పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ మూవీ SSMB 29 ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఎలాంటి హడావుడి లేకుండా సాగుతుండగా, ఇందులో భాగస్వాములైన నటీనటుల విషయంలో మాత్రం సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ల పేర్లు ఖరారవుతుండగా… ఓ క్రేజీ వార్త ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది.
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌కు సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం ఆఫర్ వెళ్లిందని, కానీ ఆయన ఒప్పుకోలేదన్న సమాచారం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. తాను విలన్ పాత్రలను ఇప్పుడే చేయలనుకోవడం లేదనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇదే రోల్‌ను ప్రస్తుతం పృథ్వీరాజ్ లేదా ఆర్ మాధవన్ చేయనున్నారన్నది తాజా టాక్. కాగా బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ కూడా ఇదే చిత్రాన్ని రిజెక్ట్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో రాజమౌళి స్టైలిష్ విలన్ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక మహేష్ బాబు పాత్ర విషయానికి వస్తే… ఇది ఆయన కెరీర్‌లోనే భిన్నమైన లుక్, ఛాలెంజింగ్ గెటప్‌తో రూపుదిద్దుకుంటోందట. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో తెరకెక్కనుందని టాక్. 2026 లేదా 2027లో విడుదల చేసేలా ప్రణాళికలు చేస్తున్నారట. ఇక అప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చే ప్రతి వార్తా… ఓ సంచలనమే.