టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఈ మధ్య బ్యాక్ టూ బ్యాక్ సెలబ్రేషన్స్ తో తెగ హడావుడి చేస్తున్నారు. మహేష్ సినిమా గురించి చిన్న అప్డేట్ వచ్చినా, అది ఒక పండగ సంబరంగా మార్చేయడం వాళ్ల ప్రత్యేకత. ప్రస్తుతం మహేష్ రాజమౌళితో చేస్తున్న SSMB 29 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆ సినిమా 2026 చివర్లోనే విడుదల అవుతుందనడంతో, అప్పటివరకు మహేష్ అభిమానులు రీ రిలీజ్ లతో సరదా చేసుకుంటున్నారు.
రీసెంట్‌గా వచ్చిన ముఫాసా మూవీకి మహేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీన్ని కూడా మహేష్ ఫ్యాన్స్ ఓన్ సినిమా లా సెలబ్రేట్ చేశారు. థియేటర్ల దగ్గర కటౌట్లు, కేక్ కట్టింగ్స్‌తో మహేష్ ఫ్యాన్స్ తెగ సందడి చేశారు. ముఫాసా తర్వాత, ఇప్పుడు గుంటూరు కారం రీ రిలీజ్ పైనే ఫోకస్ పెట్టారు. గుంటూరు కారం మొదట డివైడ్ టాక్ తెచ్చుకున్నా, రీ రిలీజ్ పైన అభిమానులలో హైప్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.
హైదరాబాద్ లో గుంటూరు కారం రీ రిలీజ్ కోసం రెండు షోల టికెట్లు ఇప్పటికే పూర్తిగా బుక్ అయ్యాయి. ఇదే జోరుతో మరిన్ని షోలు వేయాలనే డిమాండ్ పెరుగుతోంది. దీనికితోడు, మహేష్ ఫ్యాన్స్ తీసుకురానున్న ఈ ఉత్సాహం చూస్తుంటే, ఏ సినిమా అయినా సక్సెస్ చేస్తారనిపిస్తుంది.
మహేష్ బాబు ఫ్యాన్స్ చేసిన ఈ సందడి, రీ రిలీజ్ లకు వచ్చిన భారీ రెస్పాన్స్ నెటిజన్లలో చర్చనీయాంశంగా మారింది. మహేష్ ఫ్యాన్స్ ఆదరణ వేరు, వాళ్ల జోష్ ఇంకొంతమంది అభిమానులకు కూడా ఆదర్శమంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజంగా మహేష్ బాబు ఫ్యాన్స్ రూట్ ప్రత్యేకమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.