తమిళ దర్శకుడు టి. జ్ఞానవేల్ దర్శకత్వంలో హీరో సూర్య ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం జై భీమ్. ఈ సినిమా ద్వారా సినతల్లి పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు నటి లిజోమోల్ జోస్ . గిరిజన మహిళగా సహజసిద్ధంగా నటించే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పించారు. ఇదిలావుండగా తాజాగా ఈ సినిమా గురించి సిన తల్లి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలై విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న జై భీమ్ చిత్రం కోసం తను ఎంతో కష్టపడ్డానని తెలిపారు.
ఈ చిత్రంలో ఒక గిరిజన మహిళగా కనిపించడం కోసం ప్రతిరోజు గిరిజనులు నివసించే గుడిసెలకు వెళ్లి వారి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. అక్కడివారు చెప్పులు లేకుండా రాత్రి పగలు అనే తేడా లేకుండా అటవీ ప్రాంతాలలో వేటకు వెళ్తారని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. ఈ సినిమా కోసం ఎన్నో పనులను కూడా నేర్చుకున్నానని తెలిపారు.
ముఖ్యంగా గిరిజన ప్రజలు కొండలలో లభించే ఎలుకలను తింటారు. అయితే ఈ సినిమాలో తాను కూడా ఎలకలు తిన్నానని ఈ సందర్భంగా ఈమె చేశారు. అటవీ ప్రాంతంలో దొరికే ఎలకలు ఎంతో మంచివని గిరిజనులు చెప్పడం చేత వాటిని తినడం నేర్చుకున్నానని అచ్చం చికెన్ మాదిరిగా ఉందని ఈమె తెలియజేశారు. అయితే ఈ విషయం తన కుటుంబ సభ్యులకు తెలియజేసినప్పుడు వారు ఎలుకలు తిన్నావా అంటూ ఆశ్చర్యపోయారారని, ఆ ప్రాంత వాసులు ఎలుకలు తింటున్నప్పుడు తాను తినడంలో ఎలాంటి తప్పు లేదని తన కుటుంబ సభ్యులకు చెప్పినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.