నటీనటులు: అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగ చైతన్య, మోనా సింగ్
దర్శకుడు: అద్వైత్ చందన్
నిర్మాతలు: అమీర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధరే
సంగీత దర్శకులు : తనూజ్ టికు, ప్రీతమ్
సినిమాటోగ్రఫీ: సత్యజిత్ పాండే (సేతు)
ఎడిటర్: హేమంతి సర్కార్
అమిర్ ఖాన్ – కరీనా కపూర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లాల్ సింగ్ చడ్డా . కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.
కథ : Lal singh chaddha review telugu
లాల్ సింగ్ చడ్డా (అమీర్ ఖాన్) చిన్నతనం నుంచి అమాయకంగా ఉంటాడు. అయితే, అతని అమాయకత్వమే అతనికి మేలు చేస్తూ ఉంటుంది. లాల్ సింగ్ చడ్డాకి స్కూల్ లో రూపా (కరీనా కపూర్) ఫ్రెండ్ అవుతుంది. ఆమె సాన్నిహిత్యంలో లాల్ సింగ్ చడ్డాలో చాలా మార్పులు వస్తాయి. చివరకు లాల్ రూపాతో ప్రేమలో పడతాడు. కానీ రూపా మాత్రం డబ్బును ప్రేమిస్తూ ఉంటాడు. డబ్బు పై ఆమెకున్న కోరికతో జీవితంలో తప్పులు చేస్తోంది. మరోపక్క లాల్ మాత్రం ఆమె పై ప్రేమతో జీవితంలో బాగా ఎదుగుతాడు. బాగా డబ్బు సంపాదిస్తాడు. ఈ క్రమంలో లాల్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ?, ఈ మధ్యలో నాగచైతన్య పాత్ర ఏమిటి ? చివరకు లాల్ రూపాను పెళ్లి చేసుకున్నాడా ? లేదా ?, అసలు అతనికి జీవితం గురించి ఏం అర్ధం అయ్యింది ? తెలియాలంటే ఈ సినిమాని చూడాల్సిందే.
విశ్లేషణ : lal singh chaddha review telugu
సింపుల్ గా చెప్పాలంటే.. కథ తక్కువ, ఎమోషన్స్ ఎక్కువ. అమీర్ ఖాన్ కొన్ని సన్నివేశాల్లో ఎప్పటిలాగే తన ప్రజ్ఞను చూపించాడు. ఇక ఈ ఎమోషనల్ డ్రామాలో ఎమోషనల్ పాత్రలో నటించిన అమిర్ ఖాన్, ఆ పాత్రకు తగ్గట్లు తన లుక్ ను తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకుంటూ కొన్ని కీలకమైన సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. మరో కీలక పాత్రలో నటించిన చైతు కూడా చాలా సహజంగా నటించాడు. హీరోయిన్ కరీనా కపూర్ తన గ్లామర్ తో పాటు, తన పెర్ఫార్మన్స్ తో చాలా బాగా నటించింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఆమె నటన చాలా బాగా ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.
అయితే లాల్ సింగ్ చడ్డా సినిమాలో మ్యాటర్ లేదు. రెగ్యులర్ ప్లే, ఫేక్ ఎమోషన్స్, లాజిక్ లేని ల్యాగ్ సీన్స్ అండ్ రొటీన్ సీన్స్.. మొత్తంగా ఈ లాల్ సింగ్ చడ్డా సినిమా బోర్ కొడుతుంది. దర్శకుడు అద్వైత్ చందన్ బలమైన స్క్రిప్ట్ రాసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. లాల్ సింగ్ చడ్డా చిత్రంలో కథలో కొత్త పాయింట్ తో పాటు ఆసక్తికరమైన ఓపెనింగ్ లేదు, ఆసక్తి రెట్టింపు చేసే పాత్రల పరిచయం లేదు.
ముఖ్యంగా ఈ కథలో సమస్యలు, వాటి పరిష్కారం చాలా సిల్లీగా అనిపిస్తోంది. ఇలాంటి సీరియస్ డ్రామా తీసుకున్నప్పుడు స్క్రిప్ట్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని తూకం తప్పకుండా కథనం రాసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ సినిమా మెయిన్ పాయింట్ దగ్గరే దెబ్బ పడింది. కథనంలో మెరుపులు కాదు, పాయింట్ లో కూడా మెరుపుల్లేవు. అంతా ఊహించినట్టే జరుగుతుంది.
ప్లస్ పాయింట్స్ : అమీర్ ఖాన్ నటన, నేపథ్య సంగీతం, కొన్ని ఎమోషనల్ సీన్స్
lal singh chaddha review telugu – రేటింగ్ : 2 /5
బోటమ్ లైన్ : సిల్లీగా సాగే బోరింగ్ ఎమోషనల్ డ్రామా :