బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా. హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్ కి జోడిగా కరీనా కపూర్ నటించింది. ఇక టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో హిట్ కాలేక పోయింది. ఈ సినిమా గురించి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. దీంతో ఊహించిన స్థాయిలో ఏ సినిమా వసూళ్లు రాబట్టలేక పోయింది.
అందుకు కారణం సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమాని బాయ్‌కాట్ చేయాలంటు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అందువల్ల ఈ సినిమా గురించి తప్పుడు ప్రచారం జరగటంతో ప్రేక్షకులు సినిమా చూడటానికి ఆసక్తి చూపటం లేదని కరీనాకపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనాకపూర్ సినిమా గురించి మాట్లాడుతూ… కొందరు వ్యక్తులు కావాలనే పని కట్టుకొని సోషల్ మీడియాలో తమ సినిమా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది. కేవలం మమ్మల్ని టార్గెట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ సినిమా ఒక అద్భుతమైన సినిమా అంటూ కరీనా వెల్లడించింది.
దాదాపు మూడు సంవత్సరాల పాటు 250 మంది ఈ సినిమా కోసం కష్టపడి పని చేశారు. దయచేసి ఈ సినిమా బహిష్కరించాలని సినిమా గురించి తప్పుడు ప్రచారం చేయకండి అంటూ కరీనాకపూర్ వేడుకున్నారు. ఇది ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమాని థియేటర్ లో చూడటానికి మూడు సంవత్సరాలుగా ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నాను. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. దయచేసి ఈ సినిమా గురించి తప్పుడు ప్రచారం చేయవద్దని వేడుకుంది. ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికి వస్తే సినిమా విడుదలైన మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ. 11.50 కోట్లు వసూలు చేసింది