ఓ రకంగా చెప్పాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ ఆడియెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హాలీవుడ్ సినిమాలకి భారీ వసూళ్లు వస్తాయి కాబట్టి హాలీవుడ్ అతి పెద్ద సంస్థగా నిలిచింది. అలాగే మన దేశంలో వచ్చేసరికి హిందీ మాట్లాడేవారు అధికం కాబట్టి హిందీ సినిమాలు మార్కెట్ వసూళ్లు ఎక్కువ ఉన్నాయి.
అయితే మన తెలుగు సినిమాలు హైయెస్ట్ వసూళ్లు అందుకున్నా వాటిలో ఎక్కువ శాతం హిందీ జనం చూడడం వల్లే ఈ భారీ మార్క్ వసూళ్లు సాధ్యం అయ్యాయి. అందుకే హిందీ మార్కెట్ కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. అయితే ఇప్పుడు హిందీ జనం తమ హిందీ హీరోల సినిమాలే చూడని పరిస్థితి నెలకొంది.
దీనితో మన తెలుగు సినిమాలు పైగా హిందీ జనం ఎంతో పవిత్రంగా కొలిచే హిందూ మతంపై సరైన సినిమాలు తీస్తే అక్కడ గుడి కట్టేస్తారు. ఇప్పుడు కూడా మన లేటెస్ట్ యంగ్ హీరో నిఖిల్ నటించిన “కార్తికేయ 2” కి అదే జరుగుతుంది.
శ్రీకృష్ణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా హిందీ రిలీజ్ కూడా చేయగా అక్కడ షాకింగ్ రెస్సాన్స్ ఈ చిత్రానికి దక్కుతుందట. బాలీవుడ్ సినిమాలు లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ కన్నా ఈ సినిమాకి లిమిటెడ్ గా స్క్రీన్స్ ఉన్నా కూడా వాటిని మించి బుకింగ్స్ ఈ సినిమాకి జరుగుతున్నాయట. ఇది మాత్రం షాకింగ్ అని చెప్పాలి. దీనితో అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో తెలుగు సినిమా రైజ్ అవుతుందని చెప్పాలి.