పుట్టినరోజు నాడు సంచలన నిర్ణయం తీసుకున్న కృతి శెట్టి…ప్రశంశలు కురిపిస్తున్న అభిమానులు?

ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. ప్రతి నటించిన మొదటి సినిమాతోనే హిట్ అందుకొని హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.ఈ సినిమా మంచి హిట్ అవ్వటంతో తెలుగులో వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇలా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన కృతి శెట్టి తన పుట్టినరోజు సందర్భంగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన చాలామంది సెలబ్రిటీలు తమ సంపాదనలో కొంత భాగాన్ని పేదల కోసం ఉపయోగించాలని భావించి ఎన్జీవోలను ప్రారంభించి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మహేష్ బాబు, సమంత వంటి వారు కూడా ఎన్నో విధాలుగా పేదలకు సహాయం చేస్తు తమ మంచి మనసు చాటుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఈ లిస్టు లోకి కృతి శెట్టి వచ్చి చేరింది. ఈ క్రమంలో కృతి శెట్టి కూడా పేదలకు సేవ చేయాలని భావించి తన పుట్టినరోజు నాడు ఒక ఎన్జీవో సంస్థను స్థాపించినట్లు ప్రకటించింది.’నిష్న – ఫీడ్ ది నీడ్’అని తన తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ సంస్థను స్థాపించినట్లు కృతి వెల్లడించింది.

సోషల్ మీడియా ద్వారా స్వయంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న కృతి శెట్టి పేదలకు సహాయం చేయడంలో అందరూ సహకరించాలని కోరింది. ఈ క్రమంలో తన పుట్టినరోజు నాడు సేవా కార్యక్రమాలు నిర్వహించిన తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసింది. భవిష్యత్తులో పేదల కోసం ఎలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా అభిమానులను కోరింది. దీంతో కృతి శెట్టి తీసుకున్న నిర్ణయం పట్ల ఆమె అభిమానులతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఆమెపై ప్రశంసలకు కురిపిస్తున్నారు. ఇలా చిన్న వయసులోనే ఇంత పెద్ద బాధ్యత తీసుకుందని ఆమెను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.