ప్రపంచాన్ని షేక్ చేస్తున్న టాలీవుడ్.. తెలుగు సినిమాపై వైరల్ కామెంట్స్ చేసిన ఉపేంద్ర!

వినూత్న సినిమాల దర్శకుడిగా నటుడిగా తెలుగువారికి బాగా దగ్గరైన కన్నడ నటుడు ఉపేంద్ర. కన్నడ డబ్బింగ్ సినిమాలతోనే కాకుండా స్ట్రైట్ గా తెలుగు సినిమాలు తీసి టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా తర్వాత పెద్దగా కనిపించలేని ఉపేంద్ర ప్రస్తుతం యుఐ అనే పాన్ ఇండియా సినిమాతో మనం ముందుకి రాబోతున్నాడు. డిసెంబర్ 20న రిలీజ్ కాబోతున్న సందర్భంగా హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు మూవీ మేకర్స్. తన సినిమా గురించి మాట్లాడుతూ ప్రభాస్ మూవీ మైథలాజికల్ కల్కి అయితే నాది సైకలాజికల్ కల్కి.

మన ఎడ్యుకేషన్ సిస్టం సరిగా లేదు, ఏ ఫర్ ఆపిల్ అని చెప్పడం వలన మన థింకింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. ఏ తో వచ్చే కొన్ని పేర్లు చెప్పండి అంటే థింకింగ్ కెపాసిటీ పెరిగేది. నా కథల్లో కూడా అలాంటి ఏదైనా ఒక కొత్త ఆలోచనని చెప్పాలని ప్రయత్నం చేస్తుంటాను. ఈ సినిమాకి టైటిల్ కూడా అలాంటి ఆలోచనతోనే పెట్టాను. ఇది ఆడియన్స్ తో ఇంటరాక్టివ్ అయ్యే సినిమా. చాలా మెటాఫరికల్ ఉంటుంది. తన సినిమాని తెలుగు ఆడియన్స్ డీకోడ్ చేస్తారని నమ్మకం తనకి ఉందని అన్నాడు. అలాగే బుచ్చిబాబు గురించి మాట్లాడుతూ ఉప్పెన సినిమా చూసినప్పుడు అది అతని ఫస్ట్ సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయాను.

సినిమా ఎంతో మెచ్యూర్డ్ గా ఉంది. ఫస్ట్ టైం చేసినట్లుగా లేదు అని చెప్పారు. అలాగే చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయనతో పనిచేయాలని కథ రాసుకొని ఏడాది పాటు ఆయన కోసం తిరిగాను కానీ ఇక్కడ ఒక్కొక్క సీను, ఒక్కొక్క ఫ్రేమ్ ని 100 సార్లు చెక్ చేసుకుని రాసుకుంటున్నారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. అప్పటినుంచి స్క్రిప్ట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం అలవాటు చేసుకున్నాను అందుకే గ్యాప్ ఇస్తూ సినిమాలు చేస్తున్నాను అన్నాడు.

ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. 1000 నుంచి 2000 కోట్ల కలెక్షన్స్ చాలా ఈజీగా సంపాదిస్తున్నాయి. టాలెంట్ ఉంటే చాలు తెలుగు వాళ్ళు ఏ భాష వాళ్ళనైనా ఆదరిస్తారు, అలాంటి వాళ్లలో నేను కూడా ఒకడిని, నా గతం సినిమాల లాగే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను అన్నాడు. మరి ఈ సినిమా ఏ మేరకు హిట్ అవుతుందో చూడాలి.