టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర దర్శకుల లిస్టు రోజురోజుకు మరింత ఎక్కువవుతోంది. కమర్షియల్ సినిమాలను పక్కనపెట్టి ఎక్కువగా పాన్ ఇండియ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. ఇక వీలైనంత వరకు హీరోలు కూడా మార్కెట్ స్థాయిని పెంచుకోవడానికి సక్సెస్ లో ఉన్న దర్శకులను ఆయుధంగా వాడుకుంటున్నారు. కొరటాల శివ కూడా ఇప్పుడు అగ్ర హీరోలు బాక్సాఫీస్ ఆయుధంలా మారాడు. ఇక మరో మూడేళ్ళ వరకు మెగా సామ్రాజ్యాన్ని పరిపాలించనున్నట్లు తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీలో ఇప్పుడు హీరోలందరు ఎవరికి వారు ఒక స్థాయిలో మార్కెట్ ని సెట్ చేసుకున్నారు. ఒక్కరితో హిట్టు కొట్టినా మిగతా మెగా బ్రదర్స్ కన్ను పడినట్లే. ఇక కొరటాల శివ మెగాస్టార్ తో ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అల్లు అర్జున్ తో చేయనున్న పొలిటికల్ డ్రామా 2022లో రావచ్చు. ఇక ఆ తరువాత కూడా కొరటాల మెగా హీరోతోనే వర్క్ చేయవచ్చని సమాచారం.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో కొరటాల ఎప్పటి నుంచో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఆ మధ్య ఒక సినిమా ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యింది. కానీ కథ సరిగ్గా సెట్టవ్వలేదని దర్శకుడే వెనక్కి తగ్గాడు. ఇక 2023లో మాత్రం కొరటాల రామ్ చరణ్ కాంబో పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ రూమర్ ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఒక స్పెషల్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.
