Hero Yash: మూడు వందలతో బెంగళూరు వచ్చి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన కేజిఎఫ్ హీరో!

Hero Yash: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటించాలంటే సినీ బ్యాక్ గ్రౌండ్ అయినా ఉండాలి లేదంటే నటనా నైపుణ్యం అయినా ఉండాలి.నటన నైపుణ్యంతో పాటు అదృష్టం ఉంటేనే మనకు ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలం.అయితే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం చాలా సులభం అదే ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ స్టేటస్ సంపాదించుకోవాలంటే ఎంతో కష్టమైన పని అని చెప్పాలి. ఈ విధంగా సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన హీరో యశ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

కేజిఎఫ్ 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రికార్డులను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కర్ణాటకలో ఒక మారుమూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యశ్ జన్మించారు. తన తండ్రి ఒక సాధారణ ఆర్టీసీ డ్రైవర్ కాగా, తల్లి గృహిణి. మైసూర్ లో తన చదువులు మొత్తం పూర్తి చేసిన యశ్ తర్వాత తనకు నటన పై ఉన్న ఆసక్తితో నటన వైపు రావాలని భావిస్తున్నట్లు తన తండ్రికి చెప్పారు. అయితే నిర్ణీత గడువులోగా తనకు అవకాశాలు వస్తే సరి లేదంటే తాము చెప్పిన వృత్తిలో స్థిరపడాలని తన తల్లిదండ్రులు కండిషన్ పెట్టినట్లు యశ్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ క్రమంలోనే 300 రూపాయలను చేతిలో పట్టుకొని బెంగళూరుకు వచ్చి అవకాశాల కోసం తిరుగుతూ చివరికి సీరియల్ ఆర్టిస్ట్ గా అవకాశాలను అందుకొని నటుడిగా గుర్తింపు పొందారు. ఇలా పలు సీరియల్స్ లో నటించిన యశ్ రాఖీ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇక 2018లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇలా ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సీరియల్ ఆర్టిస్టు టూ పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ఘనత ఒక యశ్ కి మాత్రమే దక్కిందని చెప్పాలి.