కేజీఎఫ్-2 టీజర్ క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ తో పాన్ ఇండియన్ నంబర్ వన్ స్టార్ యష్ అని ఫిక్సైపోతున్నారు ..!

కేజీఎఫ్-2 టీజర్ క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ తో దేశం మొత్తం అవాక్కవుతోంది. ముందెన్నడు లేని విధంగా కేజీఎఫ్-2 టీజర్ సంచనలం సృష్ఠిస్తోంది. బాహుబలి సినిమా తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో రికార్డ్స్ .. ఇంకా చెప్పాలంటే అంతకు మించి రికార్డ్స్ బద్దలవుతున్నాయంటే అది దర్శకుడు ప్రశాంత్ నీల్ గొప్పతనం .. టాలెంట్ అని ప్రతీ ఒక్కరు ఒప్పుకుంటున్నారు. అందుకు కారణం కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ రిలీజై కనీసం 24 గంటలు పూర్తవక ముందే పాత రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది. దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారో కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ చూస్తే అర్థమైపోయింది.

KGF chapter 2 , Yash, Sanjay Dutt, Prasanth neel, Kgf 2 teaser Hindi, Kgf 2  Hindi Teaser - YouTube

ముందు నుంచి కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా విషయంలో కొత్త రికార్డులు సృష్టిస్తుందని అనుకున్నారు. కాని కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా రిలీజ్ కి రికార్డులు బద్దలు కొడుతుందని మాత్రం ఏ ఒక్కరు ఊహించలేదు. శుక్రవారం హీరో యశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. విడుదలైన గంటల్లోనే కోట్లాది వ్యూస్ రాబట్టి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.

ప్రశాంత్ నీల్ – యష్ కాంబినేషన్ లో హోంబలె నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 హీరో యష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయింది. వాస్తవంగా శుక్రవారం రిలీజ్ కావాల్సిన ఈ టీజర్ లీకవడంతో తప్పని పరిస్థితుల్లో ముందే రిలీజ్ చేసేశారు. కాగా ముందు నుంచి ఈ టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ప్రేక్షకులు మొదటి రెండు గంటలల్లోపే 10 మిలియన్స్ వ్యూస్ తో ట్రెండ్ సెట్ చేయడం ఆసక్తికరమైన విషయం. ఇంత త్వరగా టీజర్ రికార్డ్ చేసిన ఫస్ట్ సినిమా ఇదే. ఇక కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ రిలీజైన కేవలం 12 గంటల్లోనే వివిధ భాషల్లో కలిపి 25 మిలియన్ల (2.5 కోట్లు) వ్యూస్ రాబట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది.

ఇక ఈ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకే యూట్యూబ్లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ అన్ని భాషల్లో కలిపి 3 కోట్లకు పైగా వ్యూస్ సాధించడం గొప్ప విశేషం. ఈ టీజర్ లైక్స్ విషయంలోనూ ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా 1 మిలియన్ లైక్స్ 2 మిలియన్ లైక్స్ సంపాదించిన టీజర్ గా వరల్డ్ రికార్డులు నెలకొల్పింది కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్.