Allu Arjun: అల్లు అర్జున్ ప్రశాంత్ కాంబోలో కొత్త సినిమా… టైటిల్ చెప్పిన దిల్ రాజు!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దిల్ రాజు మధ్య ఎంతో మంచి అనుబంధము ఉంది వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆర్యతో మొదలైన వీరి ప్రయాణం పరుగు దువ్వాడ జగన్నాథం వంటి సినిమాలతో కొనసాగుతూ ఉన్నారు ఇటీవల వీరి కాంబోలో ఐకాన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వస్తుంది అయితే త్వరలోనే దిల్ రాజు నిర్మాణంలో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఓ సినిమా చేయబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినపడుతున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక ఈయన ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం తదుపరి సినిమాలకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినపడుతున్నాయి. ఇకపోతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ నటించిన బోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సలార్ తర్వాత ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ‘సలార్’ సీక్వెల్ కాకుండా ‘రావణం’ సినిమా చేయడానికి ప్లాన్ చేశారు.

ఆ సినిమా క్యాన్సిల్ అయింది, ప్రభాస్ దగ్గర నుంచి ఆ కథ అల్లు అర్జున్ దగ్గరకు వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం తమ్ముడు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్న దిల్ రాజు ఈ కాంబినేషన్ గురించి తెలియజేశారు.బన్నీ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘రావణం’ ప్రొడ్యూస్ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న బన్నీ ఈ సినిమా తర్వాత మరొక ప్రాజెక్ట్ పూర్తి చేయనున్నారు ఆ తర్వాతనే రావణం సెట్స్ పైకి వెళ్ళబోతుందని తెలుస్తోంది.