ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్‌ను దక్కించుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. కేజీయఫ్ సిరీస్, సలార్ వంటి సంచలనాత్మక బ్లాక్‌బస్టర్‌లను అందించిన మావెరిక్ మేకర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి వర్కింగ్ టైటిల్‌గా NTR Neel అని పేరు పెట్టారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.
ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా అప్డేట్ ఉంటుందని అభిమానులు ఆశించారు. కానీ బర్త్ డే సందర్భంగా NTR Neel నుంచి ఎటువంటి అప్డేట్ ఉండదని మేకర్లు క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ నుంచి అప్డేట్ రానుండటంతో మేకర్లు NTR Neel అప్డేట్‌ను పోస్ట్ పోన్ చేశారు. మళ్లీ సరైన సమయాన్ని చూసి మాస్ మిస్సైల్‌ను దించుతామని మేకర్లు హామీ ఇచ్చారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ మూవీని జూన్ 25, 2026న రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, ఇతర భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో, అత్యంత భారీ ఎత్తున ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ హిట్‌లకు ప్రసిద్ధి చెందిన ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌కు తన ప్రత్యేకమైన మాస్ విజన్‌ను తీసుకువస్తాడని, ఎన్టీఆర్‌లోని మరో కోణాన్ని తెరపై తీసుకు వస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, భువన్ గౌడ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. ప్రొడక్షన్ డిజైన్‌ను చలపతి నిర్వహించనున్నారు.
నటీనటులు: మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్
సాంకేతిక బృందం:
బ్యానర్‌లు : మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
నిర్మాతలు : కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు
సమర్పకులు : గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, T-సిరీస్ ఫిల్మ్స్
రచన, దర్శకత్వం : ప్రశాంత్ నీల్
ప్రొడక్షన్ డిజైన్ : చలపతి
DOP : భువన్ గౌడ
సంగీతం : రవి బస్రూర్