వైరల్ : “దృశ్యం పార్ట్ 3” కోసం కీలక డెసిషన్.!

మన ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్స్ హవా ఎప్పుడు నుంచో ఉంది కానీ మన నుంచి ఈ సీక్వెల్స్ పెద్దగా హిట్ అవ్వవు అనే సెంటిమెంట్ ని మాత్రం బ్రేక్ చేసింది మన తెలుగు సంచలన హిట్ చిత్రం “బాహుబలి 2”. మరి ఎన్నో రికార్డులు సెట్ చేసిన ఈ సీక్వెల్ తర్వాత ఎన్నో క్రేజీ సీక్వెల్స్ అయితే వచ్చాయి.

కానీ లాజికల్ గా మాత్రం ఇండియన్ ఆడియెన్స్ ని ఎంతగానో ఇంప్రెస్ చేసిన క్రేజీ సీక్వెల్ ఏదన్నా ఉంది అంటే అది మలయాళ సెన్సేషనల్ హిట్ చిత్రం “దృశ్యం 2” అని చెప్పాలి. మోహన్ లాల్, మీనా జంటగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్ర నేరుగా డిజిటల్ గానే వచ్చినప్పటికీ మాసివ్ హిట్ అయ్యింది.

దీనితో పార్ట్ 3 పై కూడా అనేక అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఈ మూడో భాగానికి సంబంధించి కీలక డెసిషన్ మేకర్స్ తీసుకున్నారని సినీ వర్గాల్లో టాక్ వైరల్ అవుతుంది. మొదటగా ఒరిజినల్ మలయాళంలో తెరకెక్కించి రిలీస్ చేస్తే ఇందులో ట్విస్ట్ లు ఇప్పుడు ఉన్న టైం లో ఇతర భాషల ఆడియెన్స్ కి కూడా తెలిసిపోతున్నాయి.

కాబట్టి ఇప్పుడు మలయాళం సహా హిందీ భాషల్లో అయితే ఈ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. సో స్పాయిలర్స్ లేకుండా ఉంటుంది అని ఇలా ప్లాన్ చేస్తున్నారట. ఇక హిందీలో అయితే అజయ్ దేవగన్ హీరోగా నటించనుండగా వచ్చే ఏడాది అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకోనుంది అని సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి.