Vrusshabha: క్రిస్మ‌స్ బ‌రిలో `వృష‌భ‌`… అత్య‌ద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్‌కి అంతా రెడీ!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అంద‌రూ ఎదురుచూస్తున్న `వృష‌భ` రిలీజ్ డేట్‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేశారు మేక‌ర్స్. ఈ ఏడాది క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఇంత‌కుమునుపెన్న‌డూ ప్రేక్ష‌కులు ఆస్వాదించ‌ని విజువ‌ల్స్ తో అత్య‌ద్భుతంగా సిద్ధ‌మ‌వుతోంది `వృష‌భ‌`.

తండ్రీ కొడుకుల మ‌ధ్య అంద‌మైన, గాఢ‌మైన అనుబంధాన్ని ఆవిష్క‌రిస్తూ, ప్రేమ‌, విధి, ద్వేషం వంటి ఎమోష‌న్స్ ని స‌మ‌ర్థ‌వంతంగా డీల్ చేసిన సినిమా `వృష‌భ‌`. నంద‌కిశోర్ ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తుంది.

అత్యంత భారీ వ్య‌యంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. గ్రాండ్ విజువ‌ల్ ఎఫెక్ట్స్, ప్ర‌తి చిన్న విష‌యాన్నీ జాగ్ర‌త్త‌గా డీల్ చేయాల్సిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించారు మేక‌ర్స్. “క్వాలిటీ విష‌యంలో మేం ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. సినిమా ల‌వ‌ర్స్ కి ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్ పీరియ‌న్స్ ఇవ్వాల‌న్న‌దే మా నిబ‌ద్ధ‌త‌. అందుకే సినిమాను క్రిస్మ‌స్ బ‌రిలో తీసుకొస్తున్నాం. ప‌ర్ఫెక్ట్ ఫెస్టివ‌ల్ గిఫ్ట్ అవుతుంది. విశ్వ‌వ్యాప్తంగా ఉన్న లాల్ ఏట్ట‌న్ అభిమానుల‌కు, మూవీ ల‌వర్స్ కి క‌న్నుల‌పండువ‌గా ఉంటుంది“ అని చెప్పారు మేక‌ర్స్.

క్రిస్మ‌స్ బ‌రిలో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నామ‌నే విష‌యాన్ని మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసి అనౌన్స్ చేశారు నిర్మాత‌లు.

మోహ‌న్‌లాల్‌, స‌మ‌ర్జిత్ లంకేష్‌, రాగిణి ద్వివేది, న‌య‌న్ సారిక‌, అజ‌య్‌, నేహా స‌క్సేనా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శామ్ సీయ‌స్ సంగీతం అందిస్తున్నారు. అకాడెమీ అవార్డ్ విన్న‌ర్ ర‌సూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేస్తున్నారు. ఎస్ ఆర్ కె, జ‌నార్ద‌న్ మ‌హ‌ర్షి, కార్తిక్ డైలాగులు అందిస్తున్నారు. పీట‌ర్ హెయిన్స్, స్టంట్ శివ‌, గ‌ణేష్‌, నిఖిల్ హై ఆక్టేన్ యాక్ష‌న్‌ని కొరియోగ్ర‌ఫీ చేశారు.

క‌నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్.య‌స్‌ స‌మ‌ర్పిస్తున్నారు. వ్యాస్ స్టూడియోస్ నిర్మిస్తోంది. శోభా క‌పూర్‌, ఏక్తా ఆర్ క‌పూర్‌, సి.కె.ప‌ద్మ‌కుమార్‌, వ‌రుణ్ మాథుర్‌, సౌర‌భ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్‌, ప్ర‌వీర్ సింగ్‌, విశాల్ గుర్ణ‌ని, జుహి ప‌రేఖ్ మెహ‌తా నిర్మిస్తున్నారు. విమ‌ల్ ల‌హోటి స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

యాక్ష‌న్‌, ఎమోష‌న్‌, విజువ‌ల్ గ్రాండియ‌ర్ క‌ల‌గ‌లిసిన అత్య‌ద్భుత‌మైన ఎపిక్ సినిమాటిక్ జ‌ర్నీగా `వృష‌భ‌`ను తీర్చిదిద్దుతున్నారు. మ‌ల‌యాళం, తెలుగులో ఏక స‌మ‌యంలో చిత్రీక‌రించారు. హిందీ, క‌న్న‌డ‌లోనూ విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Mohan Babu 50 Years Career Journey In Film Industry | Telugu Rajyam