RRR : ఆర్ ఆర్ ఆర్ సినిమా విజయం లో పాటలాడి కీలక స్థానం అనే చెప్పుకోవాలి.ఇందులోని పాటలాన్ని అభిమానుల మనసుకు చేరువ అయ్యాయి. అందులోను కొమరం బీముడో పాట థియేటట్ లలో ప్రేక్షకులను కాంటతడి పెట్టించింది.ఇంకా ఈ సినిమాలో కొమ్మ ఉయ్యాల పాట ఐతే ప్రేక్షకులకు మనసుకు హత్తుకుంది.కొమ్మా ఉయ్యాల కోన జంపాల.’ అనే పాటతోనే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా మొదలవుతుంది. సినిమా కథ అంతా ఆ పాటతోనే నడుస్తుంది అని చెప్పొచ్చు.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాట గురించే మాట్లాడుకుంటున్నారు. రీల్స్, షార్ట్స్. ఇలా ఏదైనా ఆ పాట సందడే కనిపిస్తోంది. అలాంటి పాట ఫుల్ వెర్షన్ త్వరలో రాబోతోందట.ఈ విషయాన్నీ ఆర్ ఆర్ ఆర్ సంగీత దర్శకుడు ఐన కీరవాణి ట్వీట్ ద్వారా తెలిచేసారు.సినిమా నేపథ్య సంగీతానికి వస్తున్న ఆదరణ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఆర్‌ఆర్‌ఆర్ బీజీఎంను అందరూ మెచ్చుకుంటున్నారు. వారందరి కోసం గుడ్ న్యూస్. త్వరలో బీజీఎం ఓఎస్‌టీని విడుదల చేస్తాం. ఈ విషయంలో ఆలస్యం చేసేది లేదు అంటూ ట్వీట్ చేశారు కీరవాణి. దీంతోపాటు గ్రామంలో మల్లిపాడిన పాట ఫుల్ వెర్షన్‌ను కూడా విడుదల చేస్తామని చెప్పకొచ్చారు కీరవాణి.
అయితే ఇందులో అదే ట్యూన్‌కి తారక్ పాడే పాట ఉంటుందా లేదా అనేది చెప్పలేదు.సినిమాలో ఎన్టీఆర్ కూడా ఒక సన్నివేశం లో ఈ పాట పాడుతారు. దీంతోపాటు సినిమాలో కీలక సమయాల్లో కొన్ని హమ్మింగ్స్, బీజీఎంలు అదిరిపోయాయి. వాటన్నింటికి ఒక దగ్గర చేసి విడుదల చేస్తారని సమాచారం.