Rajamouli -Keeravani: రాజమౌళి సినిమాలకు కీరవాణి ఎందుకు పనిచేస్తారు… మిగిలిన వారిపై నమ్మకం లేదా?

Rajamouli -Keeravani: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక దీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ప్రస్తుతం రాజమౌళి తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రాజమౌళి తన సినిమాలపై మరింత దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఈయన మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి ఇప్పటివరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించగా ఈ 12 సినిమాలకు కూడా కీరవాణి సంగీత దర్శకుడుగా పనిచేశారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా రాజమౌళి ఈయనని తప్ప మరెవరిని తీసుకోరు. అయితే ఇలా రాజమౌళి సినిమాలకు కీరవాణి ఎందుకు పనిచేస్తున్నారు ఇతర సంగీత దర్శకులపై రాజమౌళికి నమ్మకం లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

ఇలా రాజమౌళి సినిమాలకు సంగీత దర్శకుడిగా కీరవాణి ఎందుకు పనిచేస్తారు అనే విషయం పట్ల ఒక సందర్భంలో కీరవాణి స్వయంగా స్పందిస్తూ అసలు విషయం వెల్లడించారు. డైరెక్షన్ విషయంలో నాకు ఉన్నంత స్పష్టత సంగీత విషయంలో లేదని అందుకే తాను ఇతర సంగీత దర్శకులను తన సినిమాలకు తీసుకోనని తెలిపారు. ఇలా ఇతర సంగీత దర్శకులతో పని చేసిన నేను కంఫర్ట్ జోన్ లో సినిమా చేయలేదని వెల్లడించారు. ఇక కీరవానికి సంగీతం పట్ల పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న నేపథ్యంలో ఏ సన్నివేశానికి ఎలాంటి సంగీతం అందించాలనే విషయాలపై పూర్తి అవగాహన ఉంటుంది కనుక నా సినిమాలకు అతను సంగీత దర్శకుడుగా పనిచేస్తారని రాజమౌళి తెలిపారు.