టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు డైరెక్టర్ రాజమౌళి. మహేష్ బాబు కూడా అందుకు సంబంధించిన పనుల్లోనే బిజీ బిజీగా ఉన్నారు.ఈ సినిమాలో మహేష్ బాబు ఇంతకుముందు ఎన్నడూ కనిపించని డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు సమాచారం.
అయితే ఇప్పటివరకు ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లకపోవడంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా అనే ఉత్కంఠత అందరిలోని ఏర్పడింది.హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం.రాజమౌళి తన అన్న కీరవాణి కొడుకు శ్రీ సింహ పెళ్లి కోసం షూటింగ్ పక్కన పెట్టినట్లు తెలుస్తుంది అలాగే మహేష్ బాబు కూడా ఫారిన్ టూర్ లో బిజీగా ఉన్నాడు దాంతో మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియని ఉత్కంఠత అందరిలోనూ ఏర్పడింది. అయితే ఎన్నాళ్లు నేషనల్ వైడ్ కాస్టింగ్ తీసుకునే రాజమౌళి ఇప్పుడు గ్లోబల్ వైడ్ లో మూవీలో కాస్టింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం.
హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ థోర్ ఫేం క్రిస్ హెమ్స్‌వర్త్ ని SSMB29 మూవీకి ఎంపిక చేసుకున్నాడని టాక్. దీంతో సినిమా స్టార్ట్ అవ్వక ముందే వరల్డ్ వైడ్‌గా సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబు తప్పితే మిగిలిన కాస్టింగ్ గురించి పెద్దగా వివరాలు ఏమీ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది, సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారు అంటూ సినిమా అప్డేట్స్ కోసం తెగ ఎదురుచూస్తున్నారు ఎస్ఎస్ఎంబి ఫ్యాన్స్. మరి మూవీ టీం ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.