కన్నడ ఇండస్ట్రీలో మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిన కాంతార సినిమా..?

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన కాంతార సినిమా సెప్టెంబర్ 30వ తేదీన కన్నడ భాషలో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకి రిషబ్ శెట్టి దర్శకత్వం చాలా అద్భుతంగా ఉంది. కేవలం రూ. 18 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు అన్ని భాషలలో విడుదలై దాదాపు రూ.350 కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదట కేవలం కన్నడ భాషలో మాత్రమే విడుదల అయింది. అయితే అక్కడ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాని తెలుగు తమిళ్ హిందీ భాషలలో కూడా డబ్ చేసి విడుదల చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో అక్టోబర్ 15వ తేదీన తెలుగులో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకుంది.

ఇక తెలుగులో కూడా ఇప్పటివరకు రూ. 38 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలలో విడుదలై అందరి అంచనాలు మించి దూసుకుపోతున్న ఈ కాంతార సినిమా ఇటీవల మరొక కొత్త రికార్డు క్రియేట్ చేసింది. కన్నడ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఈ సినిమాకి కోటి టికెట్లు అమ్ముడుపోయాయని హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇలా కన్నడ భాషలో కోటి టికెట్లు అమ్మడు పోయిన మొదటి సినిమాగా కాంతారా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కథ, కథనం తో పాటు సంగీతం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

అందువల్ల ఈ సినిమా విడుదలై దాదాపు 50 రోజులు కావస్తున్నా కూడా జోరు మాత్రం తగ్గటం లేదు. అందువల్ల ఈ సినిమా ని ఇప్పుడే ఓటిటి లో విడుదల చేయటం లేదని ఈ చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. గత కొంతకాలంగా ఈ సినిమా ఓటిటి విడుదల గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నవంబరు 4 వ తేదీన ఓటిటి లో విడుదల కావాల్సిన ఈ సినిమా కి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో ఓటీటీ విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 4 వ తేదీ నుండి నవంబర్ 18 కి ఈ సినిమా ఓటీటీ విడుదలను పోస్ట్ ఫోన్ చేసినట్లు సమాచారం . అయితే ఈ విషయం గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెల్లడించలేదు.