భర్త, కొడుకు పేర్లను పచ్చబొట్టు వేయించున్న కన్నడ నటి.. పచ్చబొట్టుతో క్లారిటీ ఇచ్చిన మేఘన?

కన్నడ సూపర్ స్టార్ చిరంజీవి సర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి కన్నడ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన చిరంజీవి సర్జ కన్నడ నటి అయిన మేఘన రాజ్ ని ప్రేమించి పెద్దల అంగీకారం తో 2018 లో వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో చిరంజీవి హఠాన్మరణం తీరని లోటు మిగిల్చింది. 2020 సంవత్సరం జూన్‌ 7న చిరంజీవి సర్జ గుండె నొప్పితో మరణించారు. భర్త మరణంతో మేఘన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రాణంగా ప్రేమించిన భర్త ఇలా హఠాత్తుగా మరణించడంతో చాలాకాలం ఆ బాధ నుండి కోలుకోలేకపోయింది.

అయితే చిరంజీవి సర్జ మరణించే సమయానికి మేఘన గర్భంతో ఉంది. చిరంజీవి ప్రతిరూపంగా జన్మించిన తన బాబు ని ఎంతో అపురూపంగా చూసుకుంటూ చాలా కాలం ఇంటికే పరిమితం అయ్యింది. అయితే కొంతకాలం క్రితం మేఘన మళ్లీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ప్రస్తుతం మేఘన కొన్ని సినిమాలలో నటించటమే కాకుండా టీవి షోస్ లో కూడా పాల్గొంటోంది. ఇదిలా ఉండగా ఇటీవల మేఘన రాజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం లాస్‌వెగాస్‌లో ఉన్న మేఘన ఆమె చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది.

అయితే తాను ప్రాణంగా ప్రేమించిన తన భర్త చిరంజీవి సర్జ, కుమారుడు రాయన్‌ పేర్లను తన మణికట్టుపై పచ్చబొట్లు వేయించుకుంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫర్ ఎవర్ లవ్ అంటూ రెడ్ హార్ట్ సింబల్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా మేఘన రాజ్ రెండవ వివాహం చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని మేఘన కొట్టిపారేసింది. ప్రస్తుతం షేర్ చేసిన ఈ ఫోటోల ద్వారా మరొకసారి తన రెండవ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.