Samantha: దాచడానికి ఏమీ లేదు… చైతు ఆఖరి గుర్తును చెరిపేసిన సమంత!

Samantha: సినీనటి సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కొంతకాలం పాటు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఇలా డిప్రెషన్ లో ఉన్న ఈమె తన స్నేహితుల సహాయంతో ఈ బాధ నుంచి బయట పడ్డారు. ఇలా విడాకుల బాధ నుంచి బయటపడిన ఈమె తిరిగి అనారోగ్య సమస్యలకు గురికావడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇండస్ట్రీకి దూరమైన సమంత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతూ తిరిగి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చారు.

ప్రస్తుతం సమంత వరుస సినిమాలు వెబ్ సిరీస్ లు చేయడమే కాకుండా, నిర్మాతగా మారి సినిమాలను కూడా చేస్తున్నారు. ఇటీవల ఈమె శుభం అనే సినిమాని తన సొంత నిర్మాణ సంస్థలో తెరకేక్కించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే సమంత నాగచైతన్య చివరి జ్ఞాపకాలను కూడా చెరిపేసుకున్నారని తెలుస్తోంది. సమంత నాగచైతన్య కలిసి నటించిన మొట్టమొదటి సినిమా ఏం మాయ చేసావే . ఈ సినిమా తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారటం పెళ్లి చేసుకోవడం వరకు వెళ్ళింది.

ఇలా వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోవడమే కాకుండా తమ ప్రేమకు గుర్తుగా ఇద్దరూ పలు టాటులను కూడా వేయించుకున్నారు. ఇక సమంత అయితే ఏకంగా తన మెడపై నాగచైతన్యతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమా పేరును ymc అంటూ టాటూ వేయించుకున్నారు. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే మాత్రం తన మెడపై ఈ టాటూ లేకపోవడం గమనార్హం. ఇలా సమంత మెడపై ఈ టాటూ లేకపోవడంతో నాగచైతన్య చివరి జ్ఞాపకాలను కూడా ఈమె చెరిపేసుకున్నారని, చైతన్యను సమంత పూర్తిగా మర్చిపోయారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సమంత నుంచి నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత మరో నటి శోభితను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. ఇక సమంత మాత్రం ఇప్పటికే సింగిల్ గా ఉన్న ఈమె డైరెక్టర్ రాజ్ తో ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి కానీ ఈ వార్తలపై సమంత ఎక్కడ స్పందించలేదు.