సమంత పంచుకున్న ఓ చిన్న వీడియో.. సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ‘నథింగ్ టు హైడ్’ అంటూ సీక్రెల్ ఆల్కమిస్ట్ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆమె షేర్ చేసిన ఈ వీడియోలో, అందరి దృష్టి మాత్రం ఆమె మెడ మీదే నిలిచింది. ఎందుకంటే, గతంలో ఆమె వేసుకున్న “YMC” టాటూ కనిపించకపోవడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. వెంటనే అదే డిస్కషన్ మొదలై.. సమంత టాటూ తీసేసిందా? లేదంటే ప్రొఫెషనల్ షూట్ కోసం కవర్ చేసిందా? అన్నదానిపై ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ టాటూ ప్రత్యేకతేంటంటే… సమంత సినీ కెరీర్‌కు మొదటి అడుగు అయిన “ఏ మాయ చేసావె” సినిమాకి గుర్తుగా వేసుకున్నది. ఆ టాటూ ఆమెకు ఎమోషనల్‌గా చాలా క్లోజ్ అని గతంలో ఎన్నో సందర్భాల్లో చెప్పిన సమంత ఇప్పుడు దాన్ని తొలగించిందా? అనే డౌట్స్ కలగడం సహజం. మరీ ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ కోసం అది కవర్ చేస్తారా లేక నిజంగానే ఇప్పుడు కొత్త జీవితం మొదలుపెట్టిన ఆమె, గడచిన రోజుల గుర్తులను పోగొట్టుకోవాలనుకుంటున్నారా?
వీడియోలో సమంత తన చిరునవ్వుతో, సహజత్వంతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నా.. ఈ చిన్న టాటూ డీటెయిల్ మాత్రం వైరల్‌గా మారింది. కొందరు అభిమానులు “సామ్ కొత్త జీవితం మొదలు పెడుతోంది కాబోలు” అంటూ స్పందిస్తుండగా.. మరికొందరు “ఇది కేవలం మేకప్ ట్రిక్ కావచ్చు” అని అంటున్నారు. ఆ విషయంపై సమంత నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సమంత ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్‌లో యాక్షన్ రోల్ పోషిస్తున్నారు. అలాగే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా నిర్మిస్తూ నాయికగా నటిస్తున్నారు.