ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ ఎత్తున వినిపిస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరో పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పాలి. కాగా ప్రభాస్ ఇపుడు లోకల్ టు ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాలు చేస్తుండగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ లలో దర్శకుడు నాగశ్విన్ తో చేస్తున్న వరల్డ్ క్లాస్ చిత్రం “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి.
మరి ఈ సినిమా అయితే ఒక సెన్సేషనల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతూ ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ గా మరో సెన్సేషనల్ న్యూస్ అయితే వైరల్ గా మారింది. కాగా ఈ చిత్రం లో అయితే ఉలగనయగన్ కమల్ హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు అని కొన్ని షాకింగ్ వార్తలు అయితే వైరల్ గా మారాయి.
అంతే కాకుండా తాను కేవలం 20 నిముషాలు మేర ఈ సినిమాలో కనిపించనుండగా ఈ కొద్ది సేపటి కి కూడా రికార్డు మొత్తంలో 150 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టుగా మరో షాకింగ్ వార్త అయితే వైరల్ గా మారింది. కాగా వీటిలో ఒకటి నిజం ఒకటి అబద్దం అయితే ఉన్నాయట. నిజానికి కమల్ ఇంకా సినిమాలో జాయిన్ కాలేదు.
ప్రస్తుతం ఆయనతో చిత్ర యూనిట్ చర్చలు చేస్తున్నారట. అలాగే కమల్ అంత భారీ అమౌంట్ పారితోషకంగా తీసుకుంటున్నారు అనే దానిలో కూడా నిజం లేదట. ఈ ఫిగర్ ని ఫ్రీ పబ్లిసిటీ అండ్ హైప్ కోసమే వైరల్ చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. సో ప్రాజెక్ట్ కే విషయంలో వైరల్ అవుతున్న క్రేజీ టాక్ లో ఇదే ప్రెజెంట్ లేటెస్ట్ క్లారిటీ. కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ అయితే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.