హాలీవుడ్ లో వచ్చే సూపర్ హీరోస్ చిత్రాలకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో ఇండియాలో కూడా అంతే స్థాయిలో ఉంది. ఇండియన్ ఈ హాలీవుడ్ సూపర్ హీరోస్ సిరీస్ లో చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు. ఆ సినిమాలలో చూపించే అడ్వంచర్, యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి మన వాళ్ళు ఫ్యాన్స్ అయిపోతారు. ఇక ఓ అద్భుత ప్రపంచాన్ని ఆయా సినిమాలలో చూస్తూ ఉండటం వలన కొత్తదనం ఆశ్వాదిస్తూ ఉంటారు.
ఇలా వచ్చిన సూపర్ హీరోస్ సినిమాలలో జాన్ విక్ సిరీస్ కూడా ఉందని చెప్పాలి. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. ఆ మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇందులో నాలుగో సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ వేయగా ఇండియాలో చాలా పట్టణాలలో హౌస్ ఫుల్ షోలు పడటం విశేషం. ఇక ఈ సినిమాలో కీన్ రీవ్స్ విక్ పాత్రలో నటించాడు.
ఇప్పటికే యాక్షన్ చిత్రాలతో అతను చాలా పాపులర్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కథ పరంగా చూసుకుంటే మాఫియాని నడిపించే హై టేబుల్ పై ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న జాన్ విక్ స్నేహితులు ఒక్కొక్కరు శత్రువుల పన్నాగాలలో నష్టపోతూ ఉంటారు. విక్ ని పట్టుకున్న వారికి 40 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆఫర్ ని మాఫియా లీడర్ ఆఫర్ ఇస్తాడు.
అతన్ని పట్టుకోవడానికి వెంటపడే గ్యాంగ్స్ తో సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటాయి. కథలో ఈ యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి దర్శకుడు ప్రాధాన్యత ఇచ్చాడని చెప్పొచ్చు. ఫైట్స్, చేజింగ్ లతో చాలా స్పీడ్ గా కథ నడుస్తుంది. చివరి నలభై అయిదు నిమిషాలు అయితే సీట్ ఎడ్జ్ మీద కూర్చొని ప్రతి ఒక్కరు సినిమాని చూస్తారు.
ఇక ఇలాంటి సూపర్ హీరోస్ సినిమాలలో లాజిక్ ల జోలికి వెళ్ళకుండా ఉండటమే ఉత్తమం. అలా అయితే సినిమాని పూర్తిగా ఆశ్వాదించవచ్చు. పారిస్ లో షూట్ చేసిన పోరాట ఘట్టాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయని చెప్పాలి. అవతార్ 2 తర్వాత హాలీవుడ్ నుంచి ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.