Bollywood: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్‌ గా అలాంటి రికార్డ్!

Bollywood: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది దీపికా. 2006లో విడుదల అయినా ఐశ్వర్య అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరస సినిమాలలో నటించి మెప్పించింది. అంతే కాకుండా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం దీపికా బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటూ హాలీవుడ్ సినిమాలలో ఎక్కువగా నటిస్తోంది.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా దీపికాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే హీరోయిన్ దీపికా పదుకొణెకు ఒక అరుదైన గౌరవం దక్కింది. హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ 2026 కు గాను ఆమె ఎంపిక అయ్యారు. ఈ విషయాన్ని తాజాగా హాలీవుడ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధికారికంగా వెల్లడించింది. వినోద రంగంలో గణనీయంగా కృషి చేసినందుకు గాను ప్రతి ఏటా హాలీవుడ్‌ ఫిల్మ్‌ చాంబర్‌ హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ జాబితాను వెల్లడిస్తుంది.

ఈ ఏడాది మోషన్‌ పిక్చర్స్‌ విభాగంలో దీపికను ఎంపిక చేసినట్లు హాలీవుడ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వెల్లడించింది. అక్టోబర్ ఈ జాబితాలో డెమి మూర్‌, రాచెల్‌ మెక్‌ఆడమ్స్‌, ఎమిలీ బ్లంట్‌ వంటి హాలీవుడ్‌ తారలతో పాటు మొత్తం 35 మంది ఉన్నారు. భారత్‌ నుంచి హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా దీపికా ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. బాలీవుడ్‌ అగ్రతారలు అయిన షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌ కూడా ఈ జాబితాలో స్థానం పొందలేకపోవడం గమనార్హం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు దీపికా కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.