NTR : హాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న తారక్… హింట్ ఇచ్చిన డైరెక్టర్?

NTR : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ఎన్టీఆర్(NTR )   ఒకరు. ఈయన ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో నటించిన RRR సినిమా (RRR Movie) ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా రావడంతో ఎంతోమంది హాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు దర్శకులు సైతం ఎన్టీఆర్ రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా కారణంగా రామ్ చరణ్ కు హాలీవుడ్ అవకాశం కూడా వచ్చిందని ఆయన త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటిస్తాను అంటూ గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించిన మరో హీరో ఎన్టీఆర్ నటినకు సైతం హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ (James Gun) ఫిదా అయ్యారని తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ జేమ్స్ గన్ ఎన్టీఆర్ నటన గురించి మాట్లాడుతూ తనతో కలిసి సినిమా చేయాలని కోరిక ఉంది అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు.

RRR సినిమాలు జంతువులతో పాటు ఎన్టీఆర్ వ్యాన్ లో నుంచి బయటకు దూకే సన్నివేషంలో ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటించినట్లు డైరెక్టర్ జేమ్స్ గన్ ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఆయన నటన ఎంతో అద్భుతంగా ఉందని అతనితో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నానని తెలియజేశారు. దీంతో కచ్చితంగా ఎన్టీఆర్ కి హాలీవుడ్(Holly wood)  అవకాశాలు వస్తాయని ఎప్పటికైనా జేమ్స్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ వార్ 2 సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కూడా ఈయన ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.