లావణ్య త్రిపాఠి.. టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, క్రేజ్ ని సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే దర్శక ధీరుడు రాజమౌళి నుంచి గొప్ప హీరోయిన్ అవుతుందన్న ప్రశంసలు దక్కించుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన లావణ్య త్రిపాఠి ప్రేక్షకులని నిజంగా మాయ చేసింది. తన అందాలతో యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా నుంచి ఈ అందాల రాక్షసి కి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది.
ఇక టాలీవుడ్ లో మేకర్స్ అయితే తమ సినిమాలలో అవకాశాలివ్వడానికి క్యూ కట్టారు. చాలామంది స్టార్ హీరోయిన్ గా ఎక్కడికో చేరుకుంటుందని భావించారు. కాని అందరు అనుకున్నట్టుగా లావణ్య కెరీర్ పీక్స్ కి చేరకుండానే డైలమాలో పడింది. మంచు విష్ణు తో దూసుకెళ్తా సినిమా చేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ నటించిన మనం సినిమాలో చిన్న పాత్ర చేసింది.
అయితే ఆతర్వాత నాని తో చేసిన భలే భలే మగాడివోయ్ .. నాగార్జున తో చేసిన సోగ్గాడే చిన్ని నాయనా లావణ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక కెరీర్ కి తిరుగుండదు అని భావించారు. కాని ఇటీవల వచ్చిన అర్జున్ సురవరం తప్ప ఈ మధ్యలో వచ్చిన సినిమాలన్ని లావణ్య కి పెద్దగా ఉపయోగపడలేదు. అర్జున్ సురవరం తో మళ్ళీ మంచి హిట్ అందుకున్న ఈ అందాల రాక్షసి కి ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి ఏ 1 కాగా మరొకటి చావు కబురు చల్లగా. మరి ఈ సినిమాల మీద ఎలాంటి అంచనాలున్నాయో గాని లావణ్య కెరీర్ మాత్రం కాస్త నత్త నడకగానే సాగుతోంది.