ఇండస్ట్రీ టాక్ : టాలీవుడ్ లో ఈ భారీ నిర్మాణ సంస్థలు ఇక లేవా.?

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా కూడా ఓ సినిమా ఆడియెన్స్ వరకు రావాలి అంటే ఎంతమంది ఉన్నా కూడా నిర్మాత నిర్మాణ సంస్థ లేనిదే సినిమా లేదు. ఎన్ని కథలు రెడీ చేసుకొని ఓ దర్శకుడు ఉన్నా అతడికి నిర్మాత దొరక్కపోతే సినిమా రాదు. మరి అలా నిర్మాణంలో ఇండియన్ సినిమా దగ్గర ఎందరో దిగ్గజ నిర్మాతలు ఉన్నారు.

అలానే తెలుగులో కూడా ఎంతోమంది భారీ నిర్మాణ సంస్థలు చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దవి కూడా అయ్యాయి. మరి అలా వచ్చిన పలు నిర్మాణ సంస్థల్లో మెగా నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ ఒకటి కాగా దీనిని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ట్ చేసాడు. అలాగే దీనితో పాటుగా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా ఒకటి.

మరి దీనిని అయితే పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన మిర్చి తో తన ఫ్రెండ్స్ ని నిర్మాతలుగా పరిచయం చేస్తూ తీసుకొచ్చాడు. కాగా లేటెస్ట్ గా అయితే చరణ్, ఈ యూవీ నిర్మాతలు కలిసి వ్ మెగా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ నిర్మాణ సంస్థ అల్రెడీ పాన్ ఇండియా సబ్జెక్టు లు అనౌన్స్ చేస్తున్నారు.

అయితే దీనితో ఇప్పుడు కొణిదెల ప్రొడక్షన్స్ అలాగే యూవీ క్రియేషన్స్ లో సినిమాలు ఆగిపోయినట్టే అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరూ కూడా కలిశారు కాబట్టి సినిమాలు ఉండవు అని మెయిన్ గా యూవీ క్రియేషన్స్ నుంచి విడి విడిగా నిర్మాణ సంస్థలు రావడంతో అసలే ఉండకపోవచ్చని రూమర్స్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఈ సంస్థలలో సినిమాలు ఆగిపోయాయా లేదా అనేది చూడాలి.