“ఫిదా” ఫస్ట్ హీరో మహేష్..మరి హీరోయిన్.??

టాలీవుడ్ సినిమా దగ్గర పెద్ద కంగారు లేకుండా ఒకో సినిమాకి బాగా గ్యాప్ ఇస్తూ చేసే దర్శకుల్లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఒకరు. అయితే శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కొన్ని చిత్రాల లోనే బాక్సాఫీస్ దగ్గర భారీ లాభాలు ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి.

మరి తాను ఫామ్ లో లేని సమయంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ సినిమానే “ఫిదా”. యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి ని తెలుగులో పరిచయం చేస్తూ వచ్చిన ఈ సినిమా దిల్ రాజు కి పంట పండించింది. అయితే ఈ సినిమా విషయంలో అప్పట్లోనే ఈ కథ మొదట మహేష్ కోసం రాసానని శేఖర్ చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా మరో దర్శకుడు జయంత్ సి పరాన్జీ మహేష్ తో టక్కరి దొంగ అనే కౌ బాయ్ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రాన్ని చేసిన దర్శకుడు ఓ స్టేట్మెంట్ ఇవ్వడం వైరల్ గా మారుతుంది. జయంత్ మాట్లాడుతూ ఫిదా చిత్రాన్ని మొదట మహేష్ తో ప్లాన్ చేశామని హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ని అయితే అప్పుడు మహేష్ సరసన అనుకున్నామని తెలిపారు.

కానీ మహేష్ ఇమేజ్ రీత్యా ఆ సినిమా చేయలేదని కూడా తెలిపారు. అయితే ఇక్కడ క్లారిటీ ఏమిటంటే అప్పట్లో హిందీలో కూడా ఓ ఫిదా సినిమా ఉంది. బహుశా దానిని తెలుగు లో చేయడానికి ఈ కాంబో అనుకోని ఉండొచ్చు. పైగా జయంత్ కూడా అప్పుడు నుంచే రీమేక్ సినిమాలు చేశారు.

సో ఆ ఫిదా వేరు ఈ ఫిదా వేరు కావచ్చని కొందరు అంటున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే తెలుగు ఫిదా చిత్రాన్నే అనుకున్నారట. ఈ సినిమాని తెలుగులో మొదట మహేష్ కి దీపికా కి అనుకోగా జయంత్ ఆ సినిమాని నిర్మాణం వహించాలి అనుకున్నారట. కానీ మహేష్ కి ఇప్పుడు ఉన్న ఇమేజ్ లో వర్కౌట్ అవ్వదు అని భావించి దానిని ఆపేసినట్టుగా క్లారిటీ ఇచ్చారు.