ఈ ఏడాది టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో సంక్రాంతి కానుకగా వచ్చిన చిత్రాలు కొన్ని ఉండగా వీటిలో మంచి అంచనాలు కాంట్రవర్సీల నడుమ వచ్చిన చిత్రాలు “గుంటూరు కారం”, “హనుమాన్” చిత్రాలు అని చెప్పాలి. ఒకే రోజు చాలా ఇష్యూస్ తో రిలీజ్ అయ్యిన ఈ చిత్రాల్లో ఓపెనింగ్స్ పరంగా భారీ ఓపెనింగ్స్ ని గుంటూరు కారం అందుకుంది.
కానీ లాంగ్ రన్ లో మాత్రం హనుమాన్ ముందు ఆ చిత్రం నిలబడలేకపోయింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ కి ఆల్రెడీ భారీ లాభాలు వచ్చాయి. కానీ యూఎస్ మార్కెట్ విషయానికి వస్తే అక్కడ కూడా కేవలం ఒక్క హనుమాన్ మాత్రమే ప్రాఫిట్ వెంచర్ లోకి వెళ్లినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.
యూఎస్ లో సంక్రాంతి రిలీజ్ చిత్రాలు ఇన్ని ఉన్నప్పటికీ అన్నిటిలో కూడా ఒక్క హనుమాన్ చిత్రానికే లాభాలు వచ్చాయట. దీనికి తప్ప అన్ని చిత్రాలు నష్టాలే మిగిల్చాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తానికి అయితే యూఎస్ లో కూడా హనుమాన్ ని నమ్ముకున్నవారికి అన్యాయం జరగలేదని చెప్పాలి.
కాగా గుంటూరు కారం చిత్రానికి అనుకున్న దానికంటే ఎక్కువ నష్టాలు రావడం గమనార్హం అట. అక్కడ త్రివిక్రమ్ కి మహేష్ బాబుకి భారీ మార్కెట్ ఉంది అలాంటిది వారి కాంబినేషన్ లో సినిమా మినిమమ్ 4 మిలియన్ ని అయినా అందుకుంటుంది అని అనుకున్నారు కానీ ఈ చిత్రం 3 మిలియన్ కూడా టచ్ చెయ్యలేదు. కానీ దీనిని హనుమాన్ డబుల్ మార్జిన్ తో కొట్టి 5 మిలియన్ డాలర్స్ కి పైగా రాబట్టింది.