ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న పలు మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా రామాయణం ఆధారంగా అయితే ఈ సినిమా భారీ విజువల్స్ తో 3డి లో ప్లాన్ చేశారు.
మరి మొదట రిలీజ్ చేసిన టీజర్ కి డిజాస్టర్ రెస్పాన్స్ రావడంతో సినిమా రిలీజ్ ఆపేసి మరీ మళ్ళీ గ్రాఫికల్ వర్క్స్ స్టార్ట్ చేశారు. అయితే ఇక ఈ వర్క్ తర్వాత పోస్టర్స్ కాకుండా విజువల్ ప్రూఫ్ కోసం ఐతే ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా మూవీ లవర్స్ కూడా ఎదురు చూస్తున్నారు.
దీని బట్టి అసలు సినిమా థియేటర్స్ లో చూడాలా వద్దా అనేది డిసైడ్ అవ్వాలని చూస్తున్నారు. కాగా ఇక అందుకు ఎంతో సమయం లేనట్టుగా తెలుస్తుంది. ఈ అవైటెడ్ ట్రైలర్ కట్ ని అయితే ఈ మే మొదటి వారం లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
అలాగే ఈ సినిమా ట్రైలర్ ని బహుశా మే 5న థియేటర్స్ లో మొదట ప్లే చేస్తారన్నట్టుగా సినీ వర్గాల్లో లేటెస్ట్ గాసిప్ వినిపిస్తుంది. మరి ఈ మాసివ్ ప్రాజెక్ట్ పై అయితే అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ టాక్ అయితే బాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరి ఈ బిగ్గెస్ట్ విజువల్ డ్రామా ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.
