హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచరస్ మూవీస్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ’ఇండియానా జోన్స్’ చిత్రాలు. మొదటి భాగం 1981లో ’ఇండియానా జోన్స్ అండ్ రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్’పేరుతో రాగా.. తర్వాత 1984 లో ఇండియానా జోన్స్ అండ్ టెంపుల్ ఆఫ్ డూమ్, 1989లో లాస్ట్ క్రూసేడ్, 2008లో కింగ్‌డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్ చిత్రాలు వచ్చాయి. కాగా.. దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ నాలుగు సినిమాలు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను అందుకోవడమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.
ఈ సిరీస్ చిత్రాలలో ఇండియానా జోన్స్‌గా హారిసన్ ఫోర్డ్ నటించారు. ఇక ఈ సినిమాలలో నిధిని కాపాడే వ్యక్తిగా జోన్స్ చేసే విన్యాసాలు, అడ్వెంచర్లు ప్రేక్షకుల్ని ఇప్పటికి మర్చిపోలేకుండా చేశాయి. 1984లో వచ్చిన ఇండియానా జోన్స్ మరియు టెంపుల్ ఆఫ్ డూమ్ అనే చిత్రం భారత్ లో షూటింగ్ జరుపుకోగా.. ఈ సినిమాలో ఇండియన్ లెజెండరీ నటుడు అవ్రిూష్ పురి విలన్‌గా నటించాడు. ఇండియానా జోన్స్ సిరీస్ ఆఫ్ మూవీస్‌లలో సుమారు 42 ఏళ్ల తర్వాత 2023లో వచ్చిన చిత్రం ’ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ .
మొదటి నాలుగు సినిమాలకు స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించగా.. ఆఖరి చిత్రం డయల్ ఆఫ్ డెస్టినీ కి జేమ్స్ మాన్‌గోల్డ్ డైరెక్ట్ చేశాడు. జూన్ 29న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రంలో కూడా ఇండియానా జోన్స్‌గా హారిసన్ ఫోర్డ్ మరోసారి అలరించారు. ఈ మూవీలో హారిసన్ ఫోర్డ్ ఫేస్‌స్వాప్ టెక్నాలజీతో యంగ్ గా కనిపించి ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికలైన అమెజాన్ ప్రైమ్ వీడియో యాపిల్ టీవీ లలో ఈ సినిమా ఆగస్టు 29 నుంచి స్టీమ్రింగ్ కానుంది.