అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేష్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడుంటే!

అల్ల‌రి న‌రేష్ బ‌చ్చ‌ల‌మ‌ల్లి మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. యాక్ష‌న్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి సుబ్బు మంగ‌దేవి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హ‌నుమాన్ ఫేమ్ అమృతా అయ్య‌ర్ హీరోయిన్‌గా న‌టించింది.గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మోస్తరు కలెక్షన్స్ ని సంపాదించగలిగింది.అల్లరి నరేష్ నటనకు కూడా మంచి పేరొచ్చింది. అయితే అప్పటికే రిలీజైన పుష్ప 2 ప్రభంజనంలో బచ్చల మల్లి సినిమా లాంగ్ రన్ ను కొనసాగించలేకపోయింది.

తన ఇమేజ్‌కి భిన్నంగా సినిమాలు చేసి భారీ సక్సెస్‌ని మాత్రం అందుకోలేకపోయాడు. బచ్చల మల్లి సినిమా కూడా వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. బచ్చల మల్లి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. జనవరి 9 నుంచి అల్లరి నరేష్ సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తొంద‌ర‌లోనే బ‌చ్చ‌ల‌మ‌ల్లి ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు తెలిసింది.ఈ సినిమాపై నమ్మకంతో అల్లరి నరేష్ చాలా ఎగ్రిసివ్ గా ప్రమోషన్స్ చేసారు. ఇందులో మూర్ఖత్వంతో కూడిన వ్యకిగా నరేష్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ పాత్ర గుర్తుండిపోతుంది. నరేష్‌ కెరీర్‌లో పేరు తెచ్చిన పాత్రలు తీసుకుంటే అందులో బచ్చలమల్లి తప్పకుండా ఉంటుంది. సినిమాలో ఎన్ని పాత్రలు ఉన్నా నరేష్‌ పోషించిన మల్లి పాత్ర గుర్తుండిపోతుంది.

ప్రతి ఒక్కరి జీవితంలో పటుట్దల ఎంత అవసరమో… అవసరమైన సందర్భంలో ఓ అడుగు తగ్గాలి విడుపు కూడా ఉండాలి.అప్పుడు జీవతం సాఫీగా సాగుతుంది. బంధం, అనుబంధం నిలవాలంటే కోపతాపాలు, ప్రతీకారాలు పక్కకు పెట్టి ముందడుగు వేయాలి.. లేదంటా చివరికి ఎవరూ లేకుండా సోలోగాలనే ఉండిపోవాల్సి ఉంటుంది. ఇది నిజజీవితంలో చూసిందే. బచ్చలమల్లి జీవితం కూడా అలాంటిదే అన్నది ఇతివృత్తంగా ఈ సినిమా తెరకెక్కింది.