సినీ నటుడు రానా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా క్రియేటర్ గా వ్యవహరిస్తూ హోస్ట్ చేస్తున్న షో ది రానా దగ్గుపాటి షో. స్పిరిట్ మీడియా బ్యానర్ పై అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మించిన ఈ టాక్ షో ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభం అయింది. 55వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై రానా దగ్గుపాటి షో మొదటి ఎపిసోడ్ ని వరల్డ్ ప్రీమియర్ గా ప్రచారం చేశారు.ఈ ఎపిసోడ్లో నాచురల్ స్టార్ నాని హనుమాన్ హీరో తేజ సజ్జ, సరిపోదా శనివారం హీరోయిన్ ప్రియాంక మోహన్ అతిథులుగా పాల్గొన్నారు.
చిట్ చాట్ లో భాగంగా రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గురించి అలాగే తమ కెరియర్ల గురించి కూడా మాట్లాడుకున్నారు ఈ హీరోలు. దాంతోపాటు ఇండస్ట్రీలో హీరోల మధ్య ఉన్న ఈగోల గురించి కూడా మాట్లాడారు. కేవలం ఈగోల వల్ల హీరోలుగా ఉన్న ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశాడు రాణా. వాళ్ళ మధ్య పెద్ద శత్రుత్వం లేదని కేవలం సిల్లీ రీజన్స్ వల్ల విడిపోయారని చెప్పాడు .
ఇదే విషయంగా నాని మాట్లాడుతూ నేను 15 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, అదే ఒక క్లాస్ రూమ్ లో ఉండి ఉంటే ఒక గట్టి బంధం ఏర్పడేది కానీ ఇండస్ట్రీలో అలాంటి బంధాలు లేవు అని చెప్పుకొచ్చాడు.ఈ సందర్భంగా రామానాయుడు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్న రానా ఆయన బయట వ్యక్తుల కంటే ఇండస్ట్రీలో జనాలు ఎవరైనా వస్తే వాళ్లతో మాట్లాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు, ఎందుకంటే గతంలో ఏవైనా చిన్న తగాదాలు సమస్యలు వచ్చి ఉంటే ఇలా కలిసి మాట్లాడుకోవడం ద్వారా మనస్పర్ధలు తీరిపోయే అవకాశం ఉంటుంది అనే వారంట.
మనం ఇండస్ట్రీలో ఉంటున్నాం కాబట్టి మన ఫ్రెండ్స్ కూడా ఇండస్ట్రీ వాళ్ళు అయ్యుండాలి అనేది రామానాయుడు ఫిలాసఫీ అని చెప్పుకొచ్చాడు రానా.నాని మాట్లాడుతూ 80 90 లలో హీరోలు బాగా కలిసిపోయేవారని ఇప్పుడున్న హీరోలకి అలాంటి ఐక్యత లేదని చెప్పుకొచ్చాడు. తేజ సజ్జ మాట్లాడుతూ వాళ్లయినా కాస్త నయం కనీసం రాబోయే రోజుల్లో అయినా కలుస్తారనే ఆశ ఉంటుంది కానీ ప్రస్తుతం వస్తున్న జనరేషన్ హీరోలు మరింత ఘోరంగా ఉన్నారని వాళ్లని చూస్తే కలిసే అవకాశం ఉండటం లేదని చెప్పాడు. ఇంకా ఈ విషయాలతో పాటు నాని తన పెళ్లి వ్యవహారం గురించి కూడా చర్చించడం ప్రేక్షకులని అలరించింది.