Mithra Mandali: దేశవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ లో టాప్ #2 ట్రెండింగ్ లో నిలిచిన “మిత్రమండలి” సినిమా

బన్నీ వాస్ సమర్పణలో బివి వర్క్స్, సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై విజయేందర్ రచనా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘మిత్ర మండలి’. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా జంటగా నటిస్తూ వెండి తెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతాన్ని అందించగా సిద్ధార్థ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. అదేవిధంగా ఇప్పుడు
దేశవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ లో టాప్ #2 ట్రెండింగ్ లో నిలిచింది. ప్రస్తుతం టాప్ #1 ట్రెండింగ్ లో ఉన్న కాంతార చిత్రానికి పోటీగా నిలుస్తూ మరింత వేగంగా ప్రేక్షకులను అలరిస్తూ మిత్ర మండలి దూసుకు వెళ్తోంది.

ఒక పట్టణంలోని నలుగురు మిత్రుల మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలను సహజంగా గా చూపిస్తూ, వారి మధ్య జరిగే సన్నివేశాలను, సందర్భాలను పూర్తి స్థాయిలో వినోదభరితంగా చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో వినోదపరిచింది. మంచి విజువల్స్ తో అద్భుతమైన నిర్మాణ విలువలతో పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా మిత్రమండలి చిత్రం అన్ని జోనర్ల ప్రేక్షకులను అలరిస్తుంది. దర్శకుడు విజయేందర్ సరికొత్త శైలిలో మిత్రమండలి చిత్రాన్ని తెరకెక్కించగా నటీనటుల నటన, సంగీతం అన్నీ కలిసి సినిమాకు మరింత ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. బహుశా ఇదే ట్రెండింగ్ లో ఇంతటి ర్యాంకింగ్ సాధించటానికి కారణం అంటున్నారు చిత్ర నిర్మాతలు.

పవన్ షూటింగ్ || Analyst Ks Prasad Reacts On Pawan Kalyan Inspects Red Sandal Depot in Tirupati || TR