ఇలియానా అనే పేరుకు పరిచయం అక్కర్లేదు. ఆ పేరు వినిపించగానే ఎల్లోరా శిల్పంలాంటి ఆ రూపం గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు కుర్రాళ్లంతా కలలుగన్న ఆ రూపాన్ని ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. దేవదాస్, పోకిరి, జల్సా అంటూ ఇలా ఇలియానా టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ గోవా సుందరి మాత్రం ఇక్కడ వచ్చిన క్రేజ్‌ను బాలీవుడ్‌లో పెట్టుబడిగాపెట్టింది. కానీ టాలీవుడ్‌లో వచ్చిన క్రేజ్ బాలీవుడ్‌లో రాలేదు. కనీసం అక్కడ ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు.
మళ్లీ టాలీవుడ్ వంక తిరిగి చూసింది. దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని వంటి చిత్రాలతో ఇక్కడి వారిని మెప్పించేందుకు చూసింది కానీ వర్కవుట్ అవ్వలేదు. అలా మళ్లీ బాలీవుడ్‌కే చెక్కేసింది. అలా ఇక్కడా అక్కడా ఆఫర్స్ లేక హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లను రెచ్చగొడుతూ సోషల్ మీడియాలో కాలం గడిపేస్తోంది. తాజాగా ఇలియానా తనలోని ఆవేదనను బయట పెట్టింది.
ఇలియానా అంతర్జాతీయ బాలికల దినోత్సం (అక్టోబర్ 11) సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అంతర్జాతీయ బాలికల దినోత్సం అంటున్నారు అసలు దాని అర్థం ఏంటి. మన దేశం నలుమూలలో బాలికలు ఈ రోజున సెలెబ్రేట్ చేసుకుంటున్నారా? ఆమె కలర్‌తో సంబంధం లేకుండా ఆమె శక్తిని గుర్తించ గలుగుతున్నారా? సోదరుడితో సమానంగా సోదరిని చదివిస్తున్నామా? ఆమె జీవితంలో గొప్ప స్థానానికి చేరుకోవడానికి, సమానత్వం కల్పించడానికి మనం ఏమైనా చేస్తున్నామా? బాలికలకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆ రోజు వస్తుందని నేను కలలు కంటుంటాను. వారి కోసం మనం సురక్షితమైన సమాజాన్ని నిర్మించిస్తామని ఆశిస్తాను. వారే ఈ ప్రపంచాన్ని ఉద్దరిస్తారంటూ ఇలియానా తనలోని మరో కోణాన్ని, ఆలోచనలు బయట పెట్టింది.