వరీసు కోసం విజయ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న విజయ్!

Vijay

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ గురించి అందరికీ సుపరిచితమే అయితే ఒకప్పుడు ఈయన సినిమాలు కేవలం తమిళ చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యాయి.కానీ ఇప్పుడు ఈయనకు తెలుగులో కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈయన సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఈ క్రమంలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరికెక్కిన వరుస సినిమా కూడా తెలుగులో వారసుడు పేరుతో జనవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తమిళ వర్షన్ లో నేడు విడుదలైనప్పటికీ తెలుగులో మాత్రం మరొక మూడు రోజులపాటు వాయిదా వేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు.ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్లో తెరకేక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా కోసం విజయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

కోలీవుడ్ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇలా ఈ స్థాయిలో ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని,ఇలా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి హీరో విజయ్ అంటూ కోలీవుడ్ మీడియా ఒకింత షాక్ కి గురైంది. ఏది ఏమైనా ఒక సినిమా కోసం ఇలా 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు అయితే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కూడా విడుదల కాకపోయినప్పటికీ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలిసి అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.